వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుదేవో మహేశ్వరః: ఈ పిల్లలకు టీచర్ పట్ల ఉన్న అభిమానం ఎలాంటిదో చూడండి

|
Google Oneindia TeluguNews

Recommended Video

తమిళనాడులో గురువు పై విద్యార్థుల ప్రేమ

"గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అంటూ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి దైవత్వాన్ని ఆపాదించిన సంస్కృతి మనది...! "మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ" అంటూ తల్లిదండ్రుల తరువాతి స్ధానం గురువుకే ఇచ్చిన దేశం మనది...! "గురువు" అనే పదానికి అర్ధం "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అని పిలుస్తారు, "గు" అంటే గుహ్యమైనదానిని , "రు" అంటే దానిని రుచ్యము చేసేవాడు అంటే ఆ రహస్యాన్ని తెలియపరిచేవాడు, అదీ గురువంటే...!

ఇక అసలు విషయానికొస్తే తమిళనాడులోని భగవాన్ అనేప్రభుత్వ టీచర్ మరో స్కూలుకు బదిలీ అయ్యారు. అయితే స్కూలు వీడి మరో స్కూలుకు వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. భగవాన్‌ను వేరే స్కూలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పిల్లలు తనపై పెంచుకున్న ప్రేమకు ఫిదా అయిన భగవాన్ కూడా కంట నీరు పెట్టుకున్నారు.

Watch:Students Stop their teacher who was on transfer in Tamilnadu

తమకు భగవాన్ దేవుడిచ్చిన వరం అని విద్యార్థులు చెప్పుకొచ్చారు. విద్యార్థులు భగవాన్‌ను అడ్డుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు.

ఈ వీడియో చూసిన ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ ఇది గురుశిష్యుల బంధం అంటూ ట్వీట్ చేయగా...గురుశిష్యుల మధ్య ఇలాంటి అనుబంధం చూసి కదిలిపోయాను అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ అనిల్ స్వరూప్ ట్విటర్‌లో స్పందించారు. ఇలాంటి ఉపాధ్యాయులు మరింత మంది రావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదిలా ఉంటే పిల్లలతో తను ఎలా ఉండేవాడో భగవాన్ వివరించారు. పిల్లలతో చదువులు గురించే కాక ఇతరత్ర విజ్ఞాన అంశాలపై కూడా చర్చించేవాడినని భగవాన్ చెప్పాడు. వారి కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకుని పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందో వారి తల్లిదండ్రులకు చెప్పేవాడినని వెల్లడించారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రొజెక్టర్ వేసి పిల్లలకు చూపించేవాడినని చెప్పిన ఆయన...

ప్రొజెక్టర్‌ ద్వారా క్లాసెస్ తీసుకుంటున్న సమయంలో విద్యార్థులు ఒక సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్న అనుభవం పొందేవారని ఇలా తొందరగా నేర్చుకునే వారని చెప్పారు. పిల్లలతో సొంత కుటుంబసభ్యుడిలా మమేకమయ్యేవాడినని భగవాన్ చెప్పాడు. ఉపాధ్యాయుడు అని చెప్పడం కన్నా... వారితో ఒక స్నేహితుడిలా, ఒక సోదరుడిలా బంధం ఏర్పరచుకున్నట్లు భగవాన్ వివరించారు.

English summary
a government teacher in Tamil Nadu who had been transferred to another school was mobbed by his weeping students who did not want him to go. The students said that G Bhagawan was the best thing that had happened to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X