వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ పెళ్లి వేడుకలో అందరూ కవలలే!(వీడియో)

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఎక్కడైనా ఒకరిద్దరు కవలలను చూస్తాం. ఈ పెళ్లి వేడుకలో మాత్రం చాలా మంది కవలలను చూడొచ్చు. అది కూడా వధువులు, వరుళ్లనే కాదు. వారి తల్లిదండ్రులు కూడా కవలలే. అంతేగాక, నూతన జంటలకు పెళ్లి చేసే చేసే పూజారులు కూడా కవలలే.

అక్కడితో ఆగలేదు.. ఈ కవలల జంటలు. నూతన వధూవరుల వెంట వచ్చిన తోటి పెళ్లికూతురు, పెళ్లికుమారుడు కూడా కవలలేనట. వినేందుకు కొంత వింతగా ఉన్నప్పటికీ.. ఈ వివాహం నిజంగా జరిగింది. ఎక్కడో కాదు, కేరళ రాష్ట్రంలోని పులూర్‌లో.

 Watch: This wedding has twin brides, grooms and priests

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రీమా, రీనా అనే ఇద్దరు కవల సోదరీమణులు. ఇటీవలే వీరిద్దరి వివాహం అదే ప్రాంతానికి చెందిన దిల్రాజ్‌, దిల్కర్‌ అనే కవల సోదరులతో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. పులూర్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ చర్చిలో ఈ కవల జంటల వివాహాన్ని రెజీ, రోజీ అనే కవల ఫాదర్‌లు జరిపించారు.

అంతేగాక, నూతన వధూవరులతో వచ్చిన తోటి పెళ్లికూతురు, తోడు పెళ్లి కొడుకు కూడా కవల పిల్లలే. ఈ వివాహ వీడియోను ఓ స్థానిక వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఈ పెళ్లి వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

English summary
While this story might sound too filmy, but believe us it’s true. The wedding took place at St. Xavier’s church in Pulur, Kerala, where the twin priest performed the wedding ceremony of the identical twin sisters Reema and Reena and twin brothers Dhiraj and Diker, according to Iranjalakuda.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X