వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: రూ. 30 కోసం యజమానిని చంపేశాడు

|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్‌: తన జీతాన్ని పెంచలేదనే ఆగ్రహంతో ఓ వాచ్‌మన్ ఇంటి యజమాని ప్రాణాలు తీశాడు. అది కూడా రూ. 30రూపాయల అదనం జీతం కోసమే. పదిరోజుల క్రితం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హత్య చేసి పారిపోయిన నిందితుడు ఆదివారం ముంబై పోలీసులకు లొంగిపోయాడు.

నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరచగా కోర్టు అతనికి జులై 14వరకు రిమాండ్‌ విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ రఘునాథ్‌ యెవ్లే అనే వ్యక్తి ఓ మూతబడిన కర్మాగారం వద్ద వాచ్‌మన్‌గా గంటకు రూ.20 వేతనంతో పనిచేసేవాడు.

ఒక రోజు యజమాని రామేశ్వర్‌ శ్రీరామ్‌.. గణేశ్‌కు జీతం ఇస్తుండగా మరో 30 రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరాడు. దీనికి యజమాని అంగీకరించకపోవడంతో గణేశ్‌ కోపంతో యజమాని తలపై పారతో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.

Watchman murders elderly employer for Rs30, arrested

విషయం తెలుసుకున్న గణేశ్‌ తల్లి, సోదరులు అతడిని రహస్యంగా ముంబై పంపించారు. కాగా, ఆదివారం మద్యం మత్తులో ఉన్న గణేశ్‌ స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి హత్య గురించి చెప్పాడు.

సమాచారాన్ని అందుకున్న ఔరంగాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ కుళ్లిపోయన రామేశ్వర్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు గణేశ్‌ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు మద్యం కోసమే అదనపు జీతం అడిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A 20-year-old watchman who allegedly murdered his employer for Rs 30 more than ten days ago was produced in court on Monday.Ganesh Raghunath Yevle, of Nanded district, was remanded in police custody till July 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X