బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జలపాతం కాదు, కుండపోత వర్షం లేదు.. ఏసీ కోచ్‌లో వరదలా నీరు.. వైరల్ వీడియో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఇళ్లల్లో ఏదో మూల నీరు లీకేజీ ఐతే తట్టుకోలేము. ఇంటిలోనే ఉంటాము కాబట్టి ఏదో విధంగా అడ్జెస్ట్ అవుతుంటాము. ఇక వర్షాకాలం వరద నీరు ఇబ్బంది పెట్టినా తట్టుకోగలం. అదే నడుస్తున్న ట్రైన్‌లో ఒక్కసారిగా నీరు వరదలా వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ. అయితే అలాంటి క్లిష్టమైన ఘటన ఒకటి వెలుగు చూడటం చర్చానీయాంశమైంది. దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!

ఏసీ యూనిట్ నుంచి వాటర్‌ లీక్‌ కావడం ఏదో సందర్భంలో దాదాపుగా అందరికీ ఎదురయ్యే అనుభవం. ఇంటిలో అలాంటి సిట్యువేషన్ ఎదురైతే ఏదోలా సర్దుకుపోతాం. అయితే ప్రయాణిస్తున్న రైలు బోగీలోని ఏసీ కోచ్‌లో కొందరికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆ వాటర్ లీక్ మామూలుగా లేదు. కుండపోత వర్షంలా.. జలపాతంలా కిందకు పడుతూనే ఉంది. దాంతో ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్నవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక వృద్దుల బాధలు వర్ణనాతీతం.

Water came out from AC in train video goes viral

సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊహించని పరిణామంతో ఆ కోచ్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏసీ కోచ్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తే.. తీరా ఇలా జరగడంతో ప్రయాణీకులు కాసింత అసహనానికి గురయ్యారు. ఆ నీటి కారణంగా కనీసం నిలబడలేని పరిస్థితి తలెత్తడంతో నరకయాతన అనుభవించారు. ఇదంతా కూడా ఓ ప్రయాణీకుడు తన ఫోన్‌లో రికార్డు చేయడంతో విషయం వెలుగుచూసింది.

English summary
A video of water 'deluge' in Bengaluru Danapur Sanghmitra Express went viral on social media. The passengers travelling in air conditioned coach of Sanghmitra Express faced problem after a stream of water started flowing in from the air conditioning vents of their coach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X