వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రైల్వే ప్రయాణికులకు డేంజర్ అలర్ట్'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులూ.. బీ అలర్ట్. ఇకనుంచి ప్రయాణాల్లో మీతో పాటు ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిదేమో! ఎందుకులే.. రైల్వే స్టేషన్లలో ఎలాగు కొలాయిలు ఉంటాయి కదా.. అనుకుంటే అనారోగ్యం బారిన పడ్డట్టే. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఈఎస్) వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయం బయటపడింది.

ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అందిస్తోన్న సేవలు అతి దారుణంగా ఉన్నాయని వెల్లడించింది బీఈఎస్. జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రైల్వే స్టేషన్ లోని నల్లాల ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటిలో ప్రతి 100ఎమ్ఎల్ నీటిలో 10 యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లుగా బీఈఎస్ నివేదికలో స్పష్టమైంది.

Water on railway platforms unfit to drink,

బాక్టీరియా పేరుకుపోయిన ఈ నీటిని తాగడం ద్వారా డయేరియా, ఉదర సంబంధ వ్యాధులు, గాస్ట్రిక్ ట్రబుల్ వంటి వ్యాధులు సోకే ప్రమాదముందని బీఈఎస్ హెచ్చరించింది. దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఢిల్లీ, పంజాబ్, గజియాబాద్,వారణాసి తదితర ప్రాంతాల రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నిర్దారించారు.

దీనిపై స్పందించిన రైల్వే అధికారులు మాత్రం.. అలాంటిదేమి లేదనడం గమనార్హం. అయితే కొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ సమస్య ఉందని, నిర్వహణ లోపాల కారణంగా కొన్ని చోట్ల మాత్రమే ఈ పరిస్థితి నెలకొందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్టేషన్ లో తాగునీటిని శుద్ది చేయడం తప్పనిసరిగా చేస్తున్నామని వివరించారు.

English summary
Drinking water supplied by the railways on platforms and its staff quarters in the northern states, including poll-bound Uttar Pradesh, is contaminated with bacteria found in human excreta that cause stomach aches and loose motions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X