చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుణుడి పగ! చెన్నై ఎందుకిలా? కారణాలెన్నో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలం అయింది. వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. ప్రజలు తిండి, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ తటాకాలను తలపిస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాలు మూసివేశారు.

ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం, సైన్యం రక్షిస్తోంది. ఎన్టీఆర్ఎఫ్ బృందం వంద బోట్ల ద్వారా సాయం చేస్తోంది. వేలాది మందిని రక్షిస్తోంది. నావికాదళం ఆహార పొట్లాలను ప్రజలకు ఇస్తోంది. చెన్నైలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం జయలలిత విహంగ వీక్షణం (ఏరియల్ సర్వే) చేశారు.

దాదాపు వందేళ్ల తరువాత ఇంతటి స్థాయిలో వర్షపాతం కురిసిందని వాతావరణశాఖ పేర్కొంది. దాదాపు కోటిమందికి పైగా ప్రజలు వరద బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో చెన్నై మునగడానికి గల కారణాలను చాలా రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

తమిళనాడు రాజధాని చెన్నై నగరం దాదాపు సమాంతరంగా ఉంటుంది. దీంతో వరద నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

చెన్నై నగరానికి సముద్రం దగ్గరగా ఉంది. పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం మరో కారణం.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

ఒకప్పుడు చెన్నైలో 400 చెరువులు ఉండేవి. ఇప్పుడు పదికి మించి లేవని చెబుతున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి కారణమని చెబుతున్నారు. చెన్నైలోని కాలువల్లో చెత్త పోగుబడి ఉంది. దీంతో, వర్షపు నీరు రోడ్ల పైకి వచ్చింది.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?


నగరంలో ప్రధానంగా మూడు నదులు ఉన్నాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో అవి కుంచించుకుపోయాయి.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

చెన్నై శివార్లలో చాలాకాలంగా రియల్ వ్యాపారం పారం జోరుగా సాగుతోంది. కోటికి పైగా జనాభా ఉంది. జనాభా పెరిగినట్లుగా మౌలిక వసతులు పెరగలేదు.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

బకింగ్ హామ్ కెనాల్ వర్షపు నీటిని తీసుకునేది. కానీ ఇప్పుడు దీనిని పట్టించుకునే వారు లేరు. పైగా వరద వస్తే నీరు బయటకు వెళ్లేందుకు ఓ మార్గం లేకుండా పోయింది.

చెన్నైలో ఎందుకు?

చెన్నైలో ఎందుకు?

నీరు బయటకు వెళ్లేందుకు ప్రభుత్వాలు నిర్మించిన కాలువలు సగంలోనే ఆగిపోయాయి. చెన్నై శివారు ప్రాంతాలైన వేలచ్చెరి తదితర ప్రాంతాల్లోని చిత్తడి నేలలు కనుమరుగయ్యాయి. దీంతో వరద నీరు ఇంకేందుకు అవకాశం లేకుండా పోయింది.

English summary
Due to the chaotic situation due to Chennai rains the essential commodities have got expensive to the limit. A one litre packet of milk was being sold for Rs 100 in some places while vegetables like tomato and beans were being sold at Rs 80 to Rs 90 per kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X