వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/వాషిగ్టంన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో సోమవారం రాత్రి సౌదీ అరేబియాకు వెళ్లడానికి ఓవర్ ఫ్లైట్ అనుమతిని మీరు ఎందుకు నిరాకరించారో మీ అభిప్రాయం చెప్పాలని పాకిస్థాన్ కు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. భారత్ మీద కుట్రలు కుతంత్రాలకు పదేపదే ప్లాన్ వేస్తున్న పాకిస్థాన్ కు ఏం పోయేకాలం వచ్చిందో అంటూ ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి.

సౌదీ రాజు సల్మాన్

సౌదీ రాజు సల్మాన్

సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్- సౌద్ తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించడంతో పాటు మంగళవారం పెట్టుబడిదారుల సమావేశానికి హాజరుకావడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ చేరుకోవడానికి పక్కదారి పట్టాల్సి వచ్చింది. పాకిస్థాన్ ఆదేశ గగనతలం మీద భారత్ ప్రధాని నరేంద్ర మోడీ విమానం ప్రయాణించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో వేరే మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని భారత్ ICAOకు సమాచారం ఇచ్చింది.

ఎందుకు చేశారు ?

ఎందుకు చేశారు ?

భారతదేశం నుంచి వెళ్లిన లేఖను ICAO కౌన్సిల్ అధ్యక్షుడు ఒలుముయివా బెనార్డ్ అలియు పరిశీలించి విచారణ చెయ్యడానికి అంగీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం మీ గగనతలం మీద వెళ్లడానికి ఎందుకు అభ్యంతరం చెప్పారు ? అని సమాధానం ఇవ్వాలని కోరుతూ లేఖ పంపారని యూఎస్ ఏవియేషన్ బాడీ ఇ మెయిల్ ద్వారా తెలిపింది.

సమాచారం లేదు

సమాచారం లేదు

అయితే, ఈ చర్య భారత్ ప్రధాని, నాయకులను తీసుకెళ్లే విమానాలు పాకిస్థాన్ గగనతలంలో ప్రవేశించే అవకాశం ఉంటుందా ? లేదా ? అని స్పష్టంగా తెలియడం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు. ICAO ప్రభుత్వాలకు సహకరించడానికి సహాయపడే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ (చికాగో కన్వెన్షన్), పౌర విమానాల కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తుందని, దేశ, సైనిక విమానాలకు కాదని ఐసీఏఓ ఓ అంతర్జాతీయ మిడియాకు ఇ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చిందని తెలిసింది.

ఘర్షణ నివారించడం

ఘర్షణ నివారించడం

జాతీయ స్థాయి నాయకులను తీసుకెళ్లే విమానాలను స్టేట్ ఎయిర్ క్రాఫ్ట్ లు (రాష్ట్ర విమానాలు)గా పరిగణిస్తున్నామని ఐరాస తెలిపింది. ICAO లక్షం ఘర్షణ నివారించడం, పౌర విమానయానంలో దాని 193 దేశాల సభ్యుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం అని ఐరాస తెలిపింది.

ఆర్టికల్ 370 రద్దు

ఆర్టికల్ 370 రద్దు

జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామాలో 40 మంది పారామిలటరీ సిబ్బందిని చంపిన తరువాత గత ఫిబ్రవరిలో డాగ్ ఫైట్ లో పాల్గొన్న తరువాత పరిస్థితులు మారిపోయాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించే విమానం మా గగనతలంలో వెళ్లడానికి వీలులేదని పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. దానికి తోడు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చెయ్యడానికి తాము వ్యతిరేకిస్తున్నామని, వెంటనే మీ నిర్ణయం మార్చుకోవాలని పాకిస్థాన్ భారత్ కు చెప్పింది.

పాకిస్థాన్ గగనతలం క్లోజ్

పాకిస్థాన్ గగనతలం క్లోజ్

ఫిబ్రవరిలో సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడిన తరువాత పాకిస్థాన్ తన గగనతలం పూర్తిగా మూసివేసింది. చివరికి పాకిస్థాన్ దశలవారిగా గగనతలం తెరిచింది. జులై 16 నుంచి పాకిస్థాన్ గగనతలంలో పూర్తి పౌర విమానాలు తెరిచింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ సౌధీకి ప్రయాణించే ప్రత్యేక విమానం మా గగనతలంలో వెళ్లడానికి వీలు లేదని పాకిస్థాన్ ఆంక్షలు పెట్టంది.

English summary
The International Civil Aviation Organisation (ICAO) has sought Pakistan’s view behind the denial of overflight permit to Prime Minister Narendra Modi’s special flight to Saudi Arabia on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X