వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో తాలిబన్ పాలనకు సూచిక: దుస్తులు 'టైట్'‌గా ఉన్నాయని మహిళా పుట్‌బాల్ మ్యాచ్‌ రద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: మహిళా క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన దుస్తులు బిగుతుగా ఉన్నాయని ఒకే ఒక్క కారణంతో మ్యాచ్‌ని రద్దు చేశారు. ఈ ఘటన జరిగిన తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్దాన్‌లోనో, ఐఎస్ఐఎస్ పాలనలో సిరియా, ఇరాక్‌లో కాదు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లాలోని చండీపూర్‌లో స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కోల్‌కతా ఎలెవన్, నార్త్ బెంగాల్ ఎలెవన్ మహిళా ఫుట్ బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలని నిర్వహకులు అనుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు రోజుల ముందు క్రీడాకారిణిలు ధరించే దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి అడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని స్ధానిక ముస్లింల నుంచి ఫిర్యాదు రావడంతో నిర్వహకులు ఏకంగా మ్యాచ్‌నే రద్దు చేశారు.

 WB: Hardliners ban women's football match as jerseys are 'too tight'

ఈ విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు మండిపడుతున్నారు. 'నేను నమ్మలేకపోతున్నా. ఇది 21వ శతాబ్దం. వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జా కాళ్ల నిండుగా ప్యాంటు ధరించి టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేసేలా ఉన్నారు' అని భారత ఫుట్ బాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన నౌషాబా ఆలం వ్యాఖ్యానించారు.

ఈ మ్యాచ్ రద్దైన విషయం తెలుసుకున్న విపక్షాలు దీనిపై నిరసన తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం బిగుతు దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దు చేసినందుకు మద్దతు ప్రకటించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్ మెంట్ అధికారులు చెప్పారు.

మతపరంగా తనపై చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించడంవల్లే మ్యాచ్‌ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు. "బెంగాల్ ఎక్కడకి పోతుంది? నేను నమ్మలేకపోతున్నా. కొన్ని మతశక్తుల ఒత్తిడి వల్లే మ్యాచ్‌ను రద్దు చేశారంటే ఆశ్చర్యంగా ఉంది" అని సీపీఐ (ఎమ్) ఎంపీ మహ్మాద్ సెలీమ్ తెలిపారు.

English summary
It’s neither Taliban-ruled Afghanistan, nor IS-ruled regions of Syria and Iraq, nor post-Islamic Revolution Iran. Yet, a women’s football match at Malda in West Bengal was cancelled two days before it was scheduled after some Muslim hardliners complained that soccer costumes are “too tight” and argued that women should not be wearing such dresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X