బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓవైపు అల్లర్లు... మరోవైపు ఆలయానికి రక్షగా ముస్లింలు... తామంతా ఒక్కటేనని....

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో మంగళవారం రాత్రి చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో డీజే హళ్లిలోని ఓ హిందూ ఆలయాన్ని అల్లరి మూకల నుంచి కాపాడేందుకు ముస్లిం వ్యక్తులు మానవహారంగా ఏర్పడ్డారు. ఇక్కడ హిందూ ముస్లింలంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని... ఏ మతానికి,కులానికి తాము వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయవద్దని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ మహమ్మద్ ప్రవక్తను కించపరచడం పట్ల తమకు న్యాయం జరగాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మానవ హారం‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో‌ వైరల్‌గా మారింది.

'మేము హిందువులను,ఈ హిందూ దేవాలయాన్ని గౌరవిస్తాం. మా పోరాటం మా పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగినవారి పైనే. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.' అని మానవహారంలో పాల్గొన్న ఓ వ్యక్తి అన్నారు. హిందూ ఆలయాన్ని కాపాడేందుకు ముస్లిం సోదరులు మానవ హారంగా ఏర్పడటాన్ని నెటిజెన్స్ కూడా ప్రశంసిస్తున్నారు.

అల్లర్లు చెలరేగిన పులకేశినగర్‌కి సమీపంలోని శివాజీనగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ...'హిందూ దేవాలయాన్ని కాపాడేందుకు మా సోదరులు మానవ హారంగా ఏర్పడటం గర్వంగా ఉంది. ఇలాంటి క్లిష్ట సందర్భంలోనూ వారు కరుణతో వ్యవహరించారు. ఐక్యత,శాంతికి తాము మద్దతుగా నిలుస్తామని వారు తనతో చెప్పారన్నారు.' అని పేర్కొన్నారు.

అల్లర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 'బెంగళూరు అల్లర్లకు కారణమైన వ్యక్తులను తప్పక అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలి. అయితే వాళ్ల కారణంగా ఒక వర్గం మొత్తాన్ని ఒకే గాటన కట్టకూడదు. ఈ మానవహారం కూడా బెంగళూరులోనే జరిగిందన్న విషయాన్ని గుర్తించాలి.' అని ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నారు.

We all live as brothers and sisters muslims human chain to save hindu temple amid bengaluru riots

బెంగళూరు అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అల్లరి మూక దాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 13 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
A viral video showing Muslim youth forming a human chain to guard a temple during the violence that erupted in Bengaluru Tuesday night has emerged on social media.The video shows young men holding hands and ensuring that rioters didn’t attack the temple located in Pulakeshinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X