వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులుగా పుట్టడమే పాపమా..? పిల్లలను తీసుకొని ఎటైనా వెళ్లాలా.. హత్రాస్ అట్టడుగు వర్గాల రోదన..

|
Google Oneindia TeluguNews

హత్రాస్.. దేశంలో ఓ జిల్లా.. కానీ దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్ చేయడంతో భారతం రగిలిపోతోంది. ముఖ్యంగా బలహీనవర్గాలు తమ అణచివేతపై మరోసారి గొంతెత్తి నినాదిస్తోన్నారు. తమకు ఎన్నాళ్లీ అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్య సిద్దించి ఏడు దశాబ్దాలవుతోన్నా.. ఇంకా వివక్ష కొనసాడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో హత్రాస్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రయత్నించింది. స్థానికులతో మాటలు కలిపి జరిగిన, జరుగుతోన్న దారుణాలను ప్రపంచానికి తెలియజేసింది.

 కొట్టుకు వెళ్లిన దూరంగానే..

కొట్టుకు వెళ్లిన దూరంగానే..

చెప్పేవి శ్రీరంగ నీతులు అన్న సామెత లాగే పరిస్థితి కొనసాగుతోంది. హత్రాస్‌ జిల్లాలో చాలా చోట్ల ఇప్పటికీ దళితులు, బలహీనవర్గాలు అంటే చిన్నచూపు. వారిని అంటరాని వారి గానే చూస్తుంటారు. అంతేందుకు సరుకుల కోసం కిరణా కొట్టుకు వెళ్లిన అదే పరిస్థితి. షాపునకు వెళ్లగానే దూరం నిల్చొవాలని చెబుతారని ఓ దళితుడు వాపోయాడు. అంతేందుకు అగ్రకులాల వారు తిట్ల దండకం ఎత్తుకుంటారని పేర్కొన్నారు. ఇక యువతి గ్యాంగ్‌రేప్ గురైన గ్రామంలో 600 కుటుంబాల వరకు ఉంటాయి. ఇందులో మెజార్టీ ఠాకూర్‌లే.. తర్వాత బ్రహ్మణ కుటుంబాలు వంద వరకు ఉంటాయి.

అగ్రవర్ణాల ఆధిపత్యం..

అగ్రవర్ణాల ఆధిపత్యం..

దళితులు తక్కువే, వాల్మికీలు 15 కుటుంబాల వరకు ఉంటాయి. ఊరిలో ఉన్న ఆలయాల్లో ప్రవేశం వీరికి నిషేధం. ఇటీవల ప్రారంభమయిన స్కూళ్లలో అగ్రవర్ణాల వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దళితులు చదువుకునేందుకు అవకాశం ఇవ్వరు. అంతేందుకు చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించే.. శ్మశానాలు కూడా.. అగ్రవర్ణాల వారికి సపరేట్.. అందులో దళితులకు రానీయరంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 కూలీ పనిచేసుకొని..

కూలీ పనిచేసుకొని..

గ్రామంలో కొందరు దళితులకు కాస్త భూమి ఉంది అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధికి స్థానికులు తెలిపారు. మిగతావారు అగ్రవర్ణాల భూముల్లో పనికెళ్లి కుటుంబాన్ని గడుపుతున్నారు. అయితే లైంగికదాడి గురై..తన కూతురు చనిపోయిన తమను పరామర్శించేందుకు రాలేదని యువతి తల్లి వాపోయింది. ఠాకూర్, బ్రహ్మణ‌ల వద్ద తాము పనిచేస్తామని.. కనీసం పలకరించలేదు అని వాపోయారు. మృతురాలి దహనం చేయడంపై మరొకరు ఆందోళన చెందారు. తనకు కూడా కూతుళ్లు ఉన్నారని.. అగ్రవర్ణాలకు చెందిన వారిని పోలీసులు ఇలా చేస్తారా అని అడిగారు. ఠాకూర్ మహిళ చనిపోతే రాత్రి దహన సంస్కారాలు చేసే దమ్ము పోలీసులకు ఉందా అని అడిగారు.

 ఊరేగింపుకు కూడా నో పర్మిషన్..

ఊరేగింపుకు కూడా నో పర్మిషన్..

ఓ దళిత యువతి పెళ్లి చేసుకోని అత్తగారి ఊరికి వచ్చింది. అయితే వారి ఊరేగింపును ఊరి మధ్య నుంచి వెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అనుమతించలేదు. దీంతో వేరే మార్గం నుంచి ఇంటికి తీసుకొచ్చారని.. దీనికి చాలా సమయం పట్టిందని యువతి ఏడుస్తూ మీడియా ప్రతినిధికి తెలిపింది. కానీ తనకు కుటుంబ సభ్యులు సర్దిచెప్పారని వివరించింది. పుట్టుక, పెళ్లి కాదు.. చనిపోయిన సమయంలో కూడా ఎదుర్కొన్నామని మరో యువతి తెలిపింది. తమ తల్లి చనిపోతే బయట ఉంచడానికి కూడా అంగీకరించలేదని వివరించింది. తమది చిన్న ఇల్లు కావడంతో వెంటనే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిందన్నారు. తనకు కోపం వచ్చిందని.. కానీ సోదరి శాంతపరిచారని వివరించారు.

మాట్లాడని అగ్రవర్ణాల పిల్లలు..

మాట్లాడని అగ్రవర్ణాల పిల్లలు..

అంతేకాదు తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారి వయస్సు 5, 10 ఏళ్లు అని ఒక వివాహిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న..అగ్రవర్ణాలకు చెందిన వారు మాట్లాడరని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు కూడ వివక్ష ఎదురవుతుందని వెల్లడించారు. దీంతో వారిని ఇక్కడినుంచి తీసుకెళదామని కోపంలో అనుకున్నామని తెలిపారు. తమలాగే తమ పిల్లలు కూడా వివక్ష, అంటరానితనాన్ని ఎదుర్కొవద్దని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. కానీ ఏం లాభం ఎక్కడైనా అగ్రవర్ణాలదే అధిపత్యం అని చెప్పారు. టీచర్లు, పోలీసులు, పరిపాలనలో బ్రహ్మిన్, ఠాకూర్‌లదే రాజ్యం అని తెలిపారు. కానీ స్కూల్ సిబ్బంది మాత్రం వివాహిత ఆరోపణలను ఖండించారు.

మేం వెళితే.. వారు అక్కడ ఉండరు...

మేం వెళితే.. వారు అక్కడ ఉండరు...


అయితే సమస్యలను గ్రామ పంచాయతీకి చెప్పేందుకు వెళితే తమ మొర అలకించే వారు లేరన్నారు. మేం వెళితే పంచాయతీ పెద్దలు వెళ్లిపోతారని పేర్కొన్నారు. కానీ పంచాయతీ పెద్ద మాత్రం ఆరోపణలను ఖండించారు. పంచాయతీ అందరీ కోసం ఉన్నదని.. తాను అందరీతో మాట్లాడకపోవచ్చునని.. కానీ ఆరోపణలకు సంబంధించి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించారు. కులంతో సబంధం లేకుండా మాట్లాడుతానని.. వారి సమస్యలను ఆలకిస్తానని చెప్పారు. జరిగిన ఘటనతో కుటుంబం బాధడుతోందని తెలుసు.. విచారణ జరుగుతోంది.. న్యాయం జరుగుతోందని తెలిపారు. కానీ తాము దళితులుగా పుట్టడమే పాపం అని కుటుంబ సభ్యుల నిట్టూర్చారు.

English summary
19-year-old’s mother says that none of their neighbours, most of them Thakurs and Brahmins, had paid a visit to offer condolences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X