వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, కంగనకు భారీ షాక్ - బీజేపీ, శివసేన రహస్య భేటీ - అమిత్ షా చెంతకు -అసలేమైందంటే

|
Google Oneindia TeluguNews

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతోన్న తీరుపై విమర్శలు.. దీనిపై ప్రశ్నించినందుకు నటి కంగనా రనౌత్ భవంతి కూల్చివేత.. మహారాష్ట్రలో కరోనా నియంత్రణలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే వైఫల్యం.. అకాల వర్షాలతో రైతుల గోస.. వరుసగా కుప్పకూలుతోన్న భవంతులు.. ఒకటారెండా.. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి అంశంపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార శివసేన కూటమిపై నిప్పులు చెరుగుతూనే ఉంది. ప్రతిపక్ష నేతగా ప్రతినిత్యం కూటమి సర్కారుపై అగ్గిఫరైయ్యే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లు రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది.

తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..

వాళ్లిద్దరికీ షాక్..

వాళ్లిద్దరికీ షాక్..

వెస్ట్రన్ ముంబైలోని ఓ లగ్జరీ హోటల్ లో శనివారం రాత్రి మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఫడ్నవిస్ ను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంతనాలు జరిపారన్న వార్త మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలను షేక్ చేసింది. సుమారు గంటన్నరపాటు సాగిన ఆ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగిందని తొలుత వెల్లడైంది. దీంతో పాత మిత్రులు మళ్లీ కలిసిపోతున్నారని, తద్వారా కాంగ్రెస్, ఎన్సీపీలకు షాక్ తప్పదని, బీజేపీ అండ చూసుకుని పేట్రేగిన కంగనా రనౌత్ కు కూడా ఇది శరాఘాతమే అవుతుందని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తాయి. కానీ సదరు భేటీపై బీజేపీ, శివసేనలు అధికారిక ప్రకటనలు చేయడంతో విమర్శలు తాత్కాలికంగా ఆగిపోయాయి..

అసలెందుకు కలిశారంటే..

అసలెందుకు కలిశారంటే..

శివసేన పార్టీ ‘సామ్నా'అనే పత్రికను కూడా నడుపుతోన్న సంగతి తెలిసిదే. ఆ పత్రికకు ఎడిటర్ గా ఎంపీ సంజయ్ రౌత్ వ్యవహరిస్తున్నారు. సామ్నా కోసం ఇంటర్వ్యూ ఇస్తారా? అని అడిగేందుకే రౌత్.. ఫడ్నవిస్ ను కలిశారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యాయ్‌ వెల్లడించారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు, కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇది ముందే నిర్ణయించిన సమావేశమని తెలిపారు. భేటీపై వివరణ ఇచ్చిన సంజయ్ రౌత్ మరో అడుగు ముందుకేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారిలా..

ముంబై నుంచి బీహార్‌కు పార్సిల్ - కొందరికి డబ్బు, మిగతావాళ్లకు వేరే: సంజయ్ రౌత్- శివసేన పోటీ?ముంబై నుంచి బీహార్‌కు పార్సిల్ - కొందరికి డబ్బు, మిగతావాళ్లకు వేరే: సంజయ్ రౌత్- శివసేన పోటీ?

కలిస్తే తప్పేంటి? మేం శత్రువులమా

కలిస్తే తప్పేంటి? మేం శత్రువులమా

‘‘సామ్నా పత్రిక కోసం గతంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను ఇంటర్వ్యూ చేశాను. ఫడ్నవిస్ ను కూడా అందుకే కలిశాను. త్వరలో అమిత్ షా, రాహుల్ గాంధీల దగ్గరికి కూడా వెళ్లి టైమ్ కోరతాను. అయినా ఫడ్నవిస్ ను కలవకుండా ఉండటానికి మా మధ్య శతృత్వం లేదుగా? దశాబ్దాలపాటు బీజేపీ, శివసేన కలిసి పనిచేశాయి. ఫడ్నవిస్ కేబినెట్ లో మేం మంత్రులుగానూ ఉన్నాం. నిన్నటి భేటీలో రాజకీయపరమైన అంశాలేవీ చర్చకు రాలేదు. ఫడ్నవిస్ ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సామ్నాకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు'' అని సంజయ్ రౌత్ ఆదివారం మీడియాకు వివరణ ఇచ్చారు. అంతేకాదు..

Recommended Video

నష్ట పరిహారం కోసం Kangana Ranaut డిమాండ్!! || Oneindia Telugu
ఇప్పుడది ఎన్డీఏ కాదు..

ఇప్పుడది ఎన్డీఏ కాదు..

ఫడ్నవిస్ ను కలవబోతున్న సంగతి సేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ముందే తెలసని, ఇది రాజకీయ అంశం కాదు కాబట్టే అంతా ప్రశాంతంగా ముగిసిపోయిందన్నారు రౌత్. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అకాళీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ గత వారం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆదివారం ఏకంగా ఎన్డీఏ నుంచే వైదొలగారు. దానిపై రౌత్ స్పందిస్తూ.. ‘‘శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించలేం. ఎందుకంటే అసలు ఎన్డీఏకు మూలస్తంభాలే ఈ రెండు పార్టీలు'' అని చెప్పారు. వాజపేయి హయాంలోని బీజేపీకి మోదీ-షాలు నడిపిస్తోన్న పార్టీకి చాలా తేడాలున్నాయని ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన పార్టీలు విమర్శంచాయి.

English summary
Shiv Sena MP Sanjay Raut on Sunday said that he met former Maharashtra chief minister and BJP leader Devendra Fadnavis on Saturday to discuss certain issues and that both of them could have ideological differences but there was no enmity between the duo. Raut, Fadnavis meeting has set off a huge buzz, though both sides have denied it was anything political.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X