వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్టూనిస్టులకు పనే తప్ప.. పాక్ కలలు నెరవేరవు: ‘బిగ్గర్ బ్లో’ అంటూ రాజ్‌నాథ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ వైపు ఉగ్రవాదులను సరిహద్దుల వెంబడి పంపిస్తూ.. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. మా సైనిక దళాలతోపాటు మా ప్రభుత్వం కూడా ఎంతో దృఢంగా ఉందని.. పాకిస్థాన్ ఎలాంటి దాడులకు దిగినా దానికి పాక్ భారీ స్థాయిలో మూల్యం(బిగ్గర్ బ్లో) చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇమ్రాన్‌కు కౌంటర్

ఇమ్రాన్‌కు కౌంటర్

ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతేగాక, తమ వద్ద అణ్వాయుధాలున్నాయంటూ, యుద్ధం వస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఖండేరీ ఉంది జాగ్రత్తా..

ఖండేరీ ఉంది జాగ్రత్తా..

ఐఎన్ఎస్ ఖండేరీతో భారత నేవీ ఎంతో బలంగా ఉన్న విషయాన్ని పాకిస్థాన్ గుర్తుంచుకుంటే మంచిదని రాజ్‌నాథ్ హెచ్చరించారు. పాకిస్థాన్‌కు తెలుసు మా బలమెంటో.. అవసరమైన సమయంలో ఆ దెబ్బెంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 1971లోనే భారత నావికా దళం తమ సత్తా ఎంటో చూపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

వెనుకాడేది లేదు..

వెనుకాడేది లేదు..

సీమాంతర ఉగ్రవాదం సవాలుగా మారిందని అన్నారు. ఉగ్రమూకలు హద్దు మీరితే ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా వెనుకాడదనే విషయం గుర్తుంచుకోవాలని రాజ్ నాథ్ స్పష్టంచేశారు. స్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ఖండేరీని, పీ-17ఏ ప్రిగటే ప్రారంభించిన సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.

కార్టూనిస్టులకు పనే తప్ప.. పాక్ కలలు నెరవేరవు

ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రతి దేశం తలుపు ట్టి కార్టునిస్టులకు పని కల్పిస్తున్నాడే తప్ప.. సాధించింది ఏమీ లేదని రాజ్ నాథ్ ఎద్దేవా చేశారు. పాక్ కుట్రల్ని తిప్పి కొట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. భారత తీర ప్రాంతాల్లో ముంబై తరహా దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. కానీ, ఆ దేశం కలలు నెరవేరవని స్పష్టం చే
శారు. భారత రక్షణ దళాలు పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

English summary
Rajnath Singh has warned Pakistan against armed conflict with India, asserting that with the strength of the nation's military and the "strong resolve of our government, we are capable of giving a much bigger blow".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X