చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత వేలిముద్రలు మాదగ్గర లేవు, బెంగళూరు జైలు అధికారి, ఎందుకంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు 2016 ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థులు పోటీ చెయ్యడానికి బీ ఫాంల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలి వేలిముద్రలు నిజంగా వేశారా ? లేదా ? అనే అనుమానాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. జయలిత వేలిముద్రల విషయంలో బెంగళూరు సెంట్రల్ జైలు అధికారి వివరణ ఇచ్చారు.

ఏకే బోస్ విజయం

ఏకే బోస్ విజయం

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏకే. బోస్ విజయం సాధించారు. ఎకే బోస్ సమర్పించిన బీ ఫాంలో జయలలిత జీవించి ఉన్న సమయంలో వేసిన వేలి ముద్రలు కావని డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జైల్లో జయలలిత !

జైల్లో జయలలిత !

జయలలిత వేలిముద్రల వివాదం ఇప్పుడు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. 2014లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ లో జైల్లో జయలలిత కొంత కాలం శిక్ష అనుభవింవచారు.

 మద్రాసు హైకోర్టు ఆదేశాలు

మద్రాసు హైకోర్టు ఆదేశాలు

మద్రాసు హైకోర్టు విచారణలో బెంగళూరు జైలు అధికారులు జయలలిత వేలిముద్రలు తీసుకున్నారని, వాటిని తెప్పించాలని డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ మనవి చేశారు. జైలు రికార్డులు తీసుకురావాలని మద్రాసు హైకోర్టు బెంగళూరు జైళ్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మా దగ్గర లేవు

మా దగ్గర లేవు

శుక్రవారం మద్రాసు హైకోర్టు ముందు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారి మోహన్ రాజ్ హాజరైనారు. జయలలిత జైలుకు వచ్చిన సమయంలో ఆమె వేలిముద్రలు సేకరించలేదని మోహన్ రాజ్ వివరణ ఇచ్చారు. బెంగళూరు జైళ్లు శాఖ అధికారుల వివరణతో డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ నిరాశ చెందారు.

English summary
Bangalore Jail officer Mohanraj has said that they haven't registered the thumb impression of late Jayalalitha when she was lodged in Parappana Agrahara prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X