బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు కర్ణాటక సీఎం అవిశ్వాస తీర్మాణం, రెబల్ ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే ?, హాయిగా ఉంటే !

|
Google Oneindia TeluguNews

ముంబై: సుప్రీం కోర్టు మద్యతంర తీర్పుతో ముంబైలో మకాం వేసిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. సుప్రీం కోర్టు మీద తమకు గౌరవం ఉందని, గురువారం బెంగళూరులోని విధాన సౌధలో సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్దం అయ్యారని, ఆ సమావేశానికి తాము హాజరుకామని రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.

బుధవారం ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు మద్యంతర తీర్పును తాము స్వాగతిస్తున్నామని రెబల్ ఎమ్మెల్యేలు అన్నారు. తమకు న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉందని, తాము ఊహించినట్లే తీర్పు వచ్చిందని, సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు.

 We do not attend tomorrows confidant vote proceedings says rebel MLAs

శాసన సభ సమావేశాలకు హాజరు కావాలా ?, వద్దా ? అనే నిర్ణయం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు ఉందని సుప్రీం కోర్టు చెప్పిందని, అందు వలన గురువారం జరిగే శాసన సభ సమావేశాలకు తాము హాజరు కాకూడదని నిర్ణయించామని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు, మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్ మీడియాకు చెప్పారు.

ముంబైలోని స్టార్ హోటల్ లో బస చేసిన 12 మంది రెబల్ ఎమ్మెల్యేలు తాము శాసన సభ సమావేశాలకు హాజరుకామని స్పష్టం చేశారు. అయితే ముంబైకి వెళ్లకుండా బెంగళూరులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు రామలింగా రెడ్డి, ఆనంద్ సింగ్, డాక్టర్ కే. సుధాకర్ గురువారం శాసన సభ సమావేశాలకు హాజరౌతారా ? లేదా ? అనే విషయం వేచిచూడాలి.

శాసన సభ సమావేశాలకు హాజరుకావాలని రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురాకూడదని, విప్ జారీ చెయ్యకూడదని సుప్రీం కోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మద్యంతర ఆదేశాలతో రెబల్ ఎమ్మెల్యేలు చాల సంతోషంగా ఉన్నారు.

English summary
Dissident MLAs clarified that they do not attend tomorrow's confidant vote proceedings happening in Karnataka assembly. They said court gave us liberty to choose not to attend assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X