వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్ డోంట్ కేర్.. ప్రజా తీర్పే అంతిమం : స్టాలిన్

|
Google Oneindia TeluguNews

చెన్నై : ఎగ్జిట్ పోల్స్‌ను అంత పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా లెక్కల్లోకి తీసుకోబోమంటున్నారు. సర్వేల ఫలితాలపై ఆధాపడబోమని.. ప్రజా తీర్పునే పరమావధిగా నమ్ముతామని స్పష్టం చేశారు.

సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?

ఆయా సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా.. ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినా కూడా తామేమీ పెద్దగా స్పందించబోమని తెలిపారు. చివరకు ప్రజా తీర్పే అంతిమమని చెప్పుకొచ్చారు. తమిళనాట డీఎంకే ప్రభంజనం సృష్టిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే తీరుగా ఫలితాలు వెల్లడించాయి. అదలావుంటే అవే అంతిమ నిర్ణయం కాదని.. ప్రజా తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

We dont believe in exit polls, says DMK chief Stalin

అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఘాటుగా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఆమె రెస్పాండ్ అయ్యారు. టీఎంసీకి 26 సీట్ల వరకు మాత్రమే వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దీదీ తప్పుబట్టారు. వాటిని తాను నమ్మబోనంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇలాంటి ఊహాగానాల ద్వారా ఈవీఎంలను మార్చి అవకతవకలకు పాల్పడేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అదలావుంటే బీజేపీయేతర పక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది ఎగ్జిట్ పోల్స్ నమ్మశక్యంగా లేవంటున్నారు. అంతా వన్‌సైడ్‌గా ప్రొజెక్ట్ చేశారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా ఈ నెల 23వ తేదీన రానున్న ఫలితాలు కేంద్రంలో అధికారం ఎవరిదనేది డిసైడ్ చేయనున్నాయి.

English summary
Even as the exit polls predicted a good show for his party, DMK President M K Stalin on Monday said he does not take the projections seriously and would wait for three days to know people's mandate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X