వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎఫ్ 16 యుద్ద విమానం నుంచి పాక్‌వి అన్ని అబద్దాలే, టెర్రరిస్ట్‌లపై యుద్ధం కొనసాగుతుంది'

|
Google Oneindia TeluguNews

త్రివిధ దళాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈసందర్భంగా మాట్లాడారు. నిన్న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్ వైపు వస్తున్నట్లుగా గుర్తించామని చెప్పారు. మిలిటరీ స్థానాలపై దాడులకు ప్రయత్నించాయని అన్నారు. తాము పాక్ యుద్ధ విమానాలను తిప్పికొట్టామని చెప్పారు. పాకిస్తాన్ విమానాలు భారత్‌లోకి చొచ్చుకు వచ్చాయని తాము గుర్తించామని చెప్పారు.

ఆ మిగ్ విమానం మనది కాదు

ఈ సందర్భంగా భారత సైన్యం ఓ మిగ్ 21 విమానాన్నికోల్పోయిందని చెప్పారు. పాకిస్తాన్ మన పైన అబద్దాలను ప్రచారం చేస్తోందని చెప్పారు. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చినట్లు, ఇద్దరు పైలట్లను బందీలుగా పట్టుకున్నట్లు పాకిస్తాన్ చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత సాయంత్రానికి మాట మార్చిందని తెలిపారు. ఒక పైలట్ మాత్రమే తమ ఆదీనంలో ఉన్నట్లు ఆ తర్వాత చెప్పిందని తెలిపారు.

అసలు మిగ్ విమానం కోల్పోలేదని మొదట పాక్ చెప్పింది

తాము అసలు ఎఫ్ 16ను ఉపయోగించలేదని పాకిస్తాన్ మొదట చెప్పిందని, కూలిన ఎఫ్ 16న మనదేనని నమ్మించే ప్రయత్నం చేసిందని అన్నారు. కానీ అది కూడా అబద్దమని తేలిందని చెప్పారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కూడా చేయలేదని అబద్దాలు చెప్పిందని తెలిపారు. కానీ మన సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ కుట్రలు ఫలించలేదన్నారు.

ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధం

ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతులు చెప్పారు. జల, వాయు, భూతలాల్లో త్రివిధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. త్రివిధ దళాలు ఒక్కటై దేశ భద్రతను కాపాడుతాయని చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కాల్పల విరమణ ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘిస్తోందని చెప్పారు.

ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగుతుంది

ఉగ్రవాదులతో భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్రిక్తతలను పాకిస్తాన్ పెంచుతోందన్నారు. భారత్ పైన దాడులకు పాకిస్తాన్ ఎఫ్ 16 యుద్ద విమానాలను వాడిందని, కానీ ఉపయోగించలేదని చెప్పిందని, పాక్ వాటిని ఉపయోగించిందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పాక్‌కు చెందిన ఎఫ్16 యుద్ధ విమానాలను కూల్చివేశామన్నారు. పాకిస్తాన్ కస్టడీ నుంచి మన పైలట్ తిరిగి వస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు.

English summary
Air Vice Marshal RGK Kapoor: We are happy that our pilot who had fallen across the Line of Control and was in custody of Pakistan is being released, we're extremely happy to have him back. We only see it as a gesture which is in consonance with all Geneva conventions. We have evidence to show that whatever we wanted to do and targets we wanted to destroy, we have done that. Decision to show the evidence is on senior leadership
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X