వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చాం, ప్రభుత్వం మాదే: కుమారస్వామి, గవర్నర్ నిర్ణయంపై సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాజ్ భవన్ వద్ద కాసేపు హైడ్రామా అనంతరం జేడీఎస్ - కాంగ్రెస్ ముఖ్య నేతలకు గవర్నర్ అపాయింటుమెంట్ లభించింది. జేడీఎస్ అధినేత కుమార స్వామి, కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షులుపరమేశ్వర, శివకుమార్, ఎన్ఆర్ పాటిల్, వీరప్ప మొయిలీలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

మేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనంమేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనం

తమకు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని చెప్పారు. తమకు గవర్నర్ అవకాశమివ్వాలని చెప్పారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎర వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం ఉందని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తాము సమర్పించామని చెప్పారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

We have submitted the necessary documents to Governor of Karnataka: kumaraswamy

మాకు అవసరమైన బలం ఉందని, ఇదే విషయం గవర్నర్‌కు చెప్పామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని కుమారస్వామి వెల్లడించారు. గవర్నర్ పైన తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

తమకు సంపూర్ణ మద్దతు ఉందని, తమ నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్లలేదని చెప్పారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశమే లేదన్నారు. కాగా, గవర్నర్ పదిమంది జేడీఎస్ ఎమ్మెల్యేలకు, పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చారు. కాగా, గవర్నర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, గవర్నర్ నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.

English summary
'We have submitted the necessary documents which show that we have the numbers required to form the government. He (Governor of Karnataka) promised he will consider according to the Constitution' HD Kumaraswamy says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X