వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీసా తిరస్కరించినట్లు ముందుగానే చెప్పాం: బ్రిటన్ ఎంపీ విషయంలో కేంద్రం క్లారిటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను విధానాలను తప్పు బట్టిన బ్రిటీష్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్‌కు భారత్ సోమవారం వీసా తిరస్కరించింది. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎమిరేట్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న డెబ్బీ అబ్రహామ్స్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఆమె ఈ-వీసా రద్దు చేస్తున్నట్లు ముందుగానే తెలిపినట్లు కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీనే డెబ్బీ అబ్రహామ్స్‌కు సంబంధించి వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపామని హోంశాఖ అధికారులు చెప్పారు.

కశ్మీర్ విధానంను వ్యతిరేకించిన బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్‌కు ఢిల్లీలో చేదు అనుభవంకశ్మీర్ విధానంను వ్యతిరేకించిన బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్‌కు ఢిల్లీలో చేదు అనుభవం

ఒకరికి వీసా ఇవ్వడం, ఉన్న వీసాను రద్దు చేయడం, లేదా వీసాను తిరస్కరించడం అనేది ఒక దేశ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ డెబ్బీ అబ్రహామ్స్‌కు ఈ-బిజినెస్ వీసా కూడా ఉంది. గతేడాది అక్టోబర్ 7న దీన్ని జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 5, 2020వరకు దీని వ్యాలిడిటీ ఉంది. అంటే ఒక వ్యక్తి బిజినెస్ పనిపై ఈ వీసాను వినియోగించుకోవచ్చు. తన బిజినెస్ పనులు పూర్తి చేసుకున్నాక తిరిగి దేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ-బిజినెస్ వీసాను కూడా తిరస్కరిస్తున్నట్లు ఫిబ్రవరి 14వ తేదీనే ఆమెకు తెలియజేసినట్లు అధికారులు చెబుతున్నారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా డెబ్బీ అబ్రహామ్స్ వ్యవహరించారనే కారణంను చూపారు.

We informed the rejection of Debbi Abrahams E-Visia before hand,clarifies Indian govt

వీసా ఎందుకు రద్దు చేశారు ఎప్పుడు రద్దు చేశారు అనేదానిపై మళ్లీ ప్రశ్నిస్తానంటూ డెబ్బీ ట్వీట్ చేశారు. తనకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మానవహక్కులకు, సామాజిక న్యాయంకు తను పీఆర్‌ఓనని చెప్పిన డెబ్బీ.. ఈ హక్కులకు దూరంగా ఉంటున్న ప్రజలపక్షాన తాను గళమెత్తుతానని చెప్పారు. నియంత్రణ రేఖకు ఇరువైపుల ఉన్న కశ్మీరీ ప్రజల పక్షాన తను నిలబడి ప్రశ్నిస్తానని చెప్పారు. ఒక మిత్రుడు మరో మిత్రుడిని గౌరవిస్తూనే విమర్శలు గుప్పించడం సరికాదన్న డెబ్బీ.. ఆరోగ్యకరమైప ప్రజాస్వామ్య దేశానికి ఇది మంచిది కాదన్నారు.

Recommended Video

PK Means Not Pawan Kalyan 'Pichhi Kukka' : Jogi Ramesh || Oneindia Telugu

తన డాక్యుమెంట్లను ఈ-వీసాను ఇమ్మిగ్రేషన్ డెస్క్ దగ్గర చూపించినట్లు డెబ్బీ అబ్రహామ్స్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలామంది తన వద్దకు వచ్చినట్లు చెప్పిన డెబ్బీ... తమకు పూర్తిగా విషయం తెలియదని మాత్రమే చెప్పారని డెబ్బీ వివరించారు. ఇంఛార్జ్‌గా వ్యవహరించే వ్యక్తికి కూడా ఏమి జరిగిందో తెలియదని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్ అంశంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును విమర్శిస్తే కేంద్రం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు

English summary
British MP Debbie Abrahams, who has been vocally critical about the Modi government's moves on Jammu and Kashmir was denied visa to enter the country because of her "involvement in anti-India activities", said government sources a day after the incident sparked controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X