వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ చేయలేదు.. కేసు రీఓపెన్ చేయాలన్న బీజేపీ నేత..

|
Google Oneindia TeluguNews

మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి.. పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై ట్విట్టర్‌లో వరుస ప్రశ్నలు సంధించిన సుబ్రహ్మణ్యస్వామి...గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ లేదా ఆటోస్పై నిర్వహించలేదని ప్రశ్నించారు.

ప్రత్యక్ష సాక్షులైన అభా,మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే రివాల్వర్‌లో ఎన్ని ఖాళీలున్నాయి..? ఆ రివాల్వర్‌‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. కాబట్టి కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

we need to re open the gandhijis murder case says subramanian swamy

మరో ట్వీట్‌లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ఉటంకిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు.

ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. అక్టోబర్,2017లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్నదానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

గాంధీ హత్య కేసులో గాడ్సే,దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని అన్నారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల.. ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.

English summary
As the Modi government and the BJP attempt to appropriate Mahatma Gandhi, one of the party’s own MPs Sunday stoked a controversy over Gandhi’s death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X