వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థ్యాంక్యూ మోడీజీ: సుస్థిర పాలనను అందిస్తాం..మా టార్గెట్ అదే: అజిత్ పవార్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఊహించని మలుపులు, అనూహ్యంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక్క రాత్రిలో సంభవించిన హైడ్రామా నేపథ్యంలో.. అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపింది ఎన్సీపీ. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడిగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లకు నరేంద్ర మోడీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ల సారథ్యంలో మహారాష్ట్ర అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఆవిర్భవిస్తుందని ఆశిస్తున్నట్లు నరేంద్ర మోడ పేర్కొన్నారు. ఆ ఇద్దరు నేతలు మహారాష్ట్రకు ఉజ్వల భవిష్యత్తును అందివ్వాలని అకాంక్షించారు.

అజిత్ పవార్ దీనికి వెంటనే బదులు ఇచ్చారు. ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన జాప్యాన్ని నివారిస్తామని అన్నారు. తమ కూటమిపై వెల్లువెత్తిన సందేహాలను పటాపంచలు చేస్తామని చెప్పారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. అట్టడుగు ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ది చేరేలా పరిపాలన కొనసాగిస్తామని అన్నారు. తమ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

We Will Ensure A Stable Government says Ajit Pawar and Thanks to PM Modi

అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా ఘన విజయాన్ని నమోదు చేశారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన తన పెద తండ్రి శరద్ పవార్ కు అండదండలను అందిస్తూ వచ్చారు. శరద్ పవార్ కు కుడిభుజంగా, అత్యంత విశ్వాసపాత్రునిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో- రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించారు. బీజేపీకి మద్దతు పలికారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకారించారు.

English summary
"Thank you Hon. Prime Minister Narendra Modi ji. We will ensure a stable Government that will work hard for the welfare of the people of Maharashtra," tweeted Mr Pawar, whose uncle and NCP chief Sharad Pawar has been working to form government with the Congress and its ideological opposite the Shiv Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X