వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో కనీవినీ ఎరుగనిరీతిలో రామాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ప్రభుత్వ విధానమేమి మారలేదు. జార్ఖండ్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎన్ఆర్సీపై మోడీ సర్కార్ వైఖరిని మరోసారి తెలియజేశారు.

 అరుణాచల్‌పై చైనా మరోసారి అక్కసు.. రాజ్‌నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్ అరుణాచల్‌పై చైనా మరోసారి అక్కసు.. రాజ్‌నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్

 ఎన్ఆర్సీ అమలు..

ఎన్ఆర్సీ అమలు..

అసోంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని తెలిపారు. ఆదివారం జార్ఖండ్‌లో రాజ్‌నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఉద్గాటించారు. అంతేకాదు తమ దేశంలో వలసదారులు ఉండాలని కోరుకోరని స్పష్టంచేశారు. కానీ కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిపై రచ్చ చేస్తున్నాయని విమర్శించారు.

 ఎందుకిలా..?

ఎందుకిలా..?

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజ్‌నాథ్ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు పెరుగుతుందా అనే వాదన కూడా ప్రారంభమైంది. కానీ మెజార్టీ వర్గం మాత్రం వ్యతిరేకంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. జార్ఖండ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

ఫుల్ మెజార్టీ

ఫుల్ మెజార్టీ

బొటా బోటి కాకుండా.. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు. బీజేపీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను విమర్శించే స్థాయి ఏ నేతకు లేదని గుర్తుచేశారు. వారే అవినీతిపరులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కనీవినీ ఎరుగనిరీతిలో

కనీవినీ ఎరుగనిరీతిలో

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. రాముడి జన్మస్థానంలో ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఆలయ నిర్మాణం ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోను విమర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు చూడండి ఆ హామీ నెరవెరబోతుందని చెప్పారు.ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆలయంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. నాలుగేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

English summary
defence Minister Rajnath Singh on Sunday said the government will implement the National Register of Citizens (NRC) across India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X