వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చోటా రాజన్‌ను జైల్లోనే చంపేస్తాం: చోటా షకీల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చోటా షకీల్‌ను తీహార్ జైల్లోనే చంపుతామని మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ అన్నారు. శనివారం నాడు దావూద్ 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షకీల్ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం చాలా భక్తిపరుడయ్యాడని, అయితే ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనేమీ లేదని అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ వెల్లడించాడు.

దావూద్ పుట్టిన రోజు వేడుక ఎలా జరుపుకోవాలో వారి కుటుంబం నిర్ణయిస్తుందని చెప్పాడు.
దావూద్ పుట్టినరోజు వేడుకలు భారీగా జరుగుతాయని, మాఫియా సామ్రాజ్యానికి వారసుడిని ప్రకటిస్తారని మీడియాలో వచ్చిన కథనాలన్నీ బాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ వంటివేనని షకీల్ కొట్టిపారేశాడు.

We will kill Rajan in Tihar jail, says Chhota Shakeel

‘దావూద్ భాయ్ స్థానంలోకి వేరెవరూ రారు. ఆయన రిటైర్ అవ్వరు. మమ్మల్ని ఆయనే నడిపిస్తారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' అని షకీల్ స్పష్టం చేశాడు. దావూద్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, ఆయన దృష్టి అంతా వ్యాపారంపైనే ఉందని చెప్పాడు. తాము 99 శాతం వ్యాపారంపైనే దృష్టి నిలుపుతామని చెప్పాడు. తమ దారికి అడ్డొచ్చే వారిని తొలగించడానికి మిగిలిన ఒక్క శాతాన్ని కేటాయిస్తామన్నాడు.

చోటా రాజన్ చచ్చిన పాము అని, తీహార్ జైలులో తనను తాను కాపాడుకోవాలని చెప్పాడు. విదేశాలలో రాజన్‌ను చంపేందుకు తాము పలుమార్లు ప్రయత్నించిన మాట నిజమేనని అంగీకరించాడు.

ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా తామే రాజన్‌ను చంపుతామని చెప్పాడు. దావూద్ చాలా భక్తిపరుడయ్యాడని, ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్ చదువుతాడని, ప్రతి ఏడాది హజ్ వెళ్తున్నాడని తెలిపాడు. భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచన దావూద్‌కు లేదని షకీల్ పేర్కొన్నాడు.

English summary
Dreaded underworld don, Dawood Ibrahim, who has been reportedly hiding in Pakistan since the Mumbai blasts in 1993, has turned religious. In an exclusive interview with Mail Today, his closest aide Chhota Shakeel spilled the beans on Dawood's birthday celebrations, their plans for Chhota Rajan and more. Dawood is turning 60 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X