వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ కలెక్టర్ పై హత్యాయత్నం: భయపడను, అదే అర్దరాత్రి మీ కథ చూస్తా !

ఇసుక మాఫియా ముఠా హత్యాయత్నం చేయడంతో తృటిలో తప్పించుకున్న ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ ప్రత్యర్థులకు ఘాటుగానే స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తేలేదని స్పష్టంచేసిన ఆమ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇసుక మాఫియా ముఠా హత్యాయత్నం చేయడంతో తృటిలో తప్పించుకున్న ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ ప్రత్యర్థులకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తేలేదని స్పష్టంచేసిన ఆమె నేరుగానే ఇసుక మాఫియా ముఠాకు వార్నింగ్ ఇచ్చారు.

<strong>లేడీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ పై హత్యాయత్నం: అర్దరాత్రి తెగించి !</strong>లేడీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ పై హత్యాయత్నం: అర్దరాత్రి తెగించి !

We will never give back. In future also we will fight against sand mafia, says Udupi.

ఉడిపి జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇసుక మాఫియా ముఠా రెచ్చిపోతుందని గుర్తు చేశారు. ఇసుక మాఫియాను కట్టడి చెయ్యడం తన మొదటి కర్తవ్యం అని ఇదే సందర్బంలో ఆమె చెప్పారు. నేనే దాడి చేసిన సమయంలో దుండగులు తన మీద హత్యాయత్నం చెయ్యడంతో షాక్ కు గురైనానని ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉడిపి జిల్లాలో ఎక్కడ అక్రమ ఇసుక మాఫియా అరచకాలు జరుగుతున్నాయో అక్కడ కచ్చితంగా దాడులు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గత ఆదివారం అర్దరాత్రి కుందాపుర సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు సమాచారం వెళ్లింది.

వెంటనే కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇసుక మాఫియా ముఠా సభ్యులు వీరి మీద హత్యాయత్నం చేశారు. ఆ సందర్బంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్ తదితరులు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

English summary
We will never give back. In future also we will fight against sand mafia, says Udupi DC Priyanka Mary Francis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X