వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలకు మోడీ అన్యాయం చేశాడు...న్యాయ్ పథకంతో మేము న్యాయం చేస్తాం: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కాంగ్రెస్ పేదలకు తీసుకురానున్న కనీస ఆదాయ పథకం న్యాయ్ బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ సర్కార్ డీమోనెటైజేషన్ చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకంతో రీమోనిటైజేషన్ చేస్తామని చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లబోయే ముందు రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న న్యాయ్ పథకం ద్వారా భారత్‌లోని మరో 20శాతం మంది పేదల జీవితాలు బాగుపడుతాయని చెప్పారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో అంటే డీమోనెటైజేషన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని తమ న్యాయ్ పథకంతో తిరిగి గాడిలోకి తీసుకొస్తామని చెప్పారు రాహుల్ గాంధీ.

తప్పుడు విధానాలతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది

తప్పుడు విధానాలతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది

ప్రధాని మోడీ గత ఐదేళ్ల పాలనలో తాను తీసుకున్న తప్పుడు విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఇందులో ప్రధానమైనది పెద్ద నోట్ల రద్దని అన్నారు. ఆ తర్వాత జీఎస్టీతో చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇది జీఎస్టీ కాదని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. కనీస ఆదాయ పథకానికి న్యాయ్ అనే పేరు పెట్టడం వెనక అర్థాన్ని వివరించారు రాహుల్. న్యాయ్ అంటే హిందీలో న్యాయం అని అర్థం అని చెప్పారు. ఈ పేరే కరెక్ట్ అని భావించి కనీస ఆదాయ పథకానికి న్యాయ్ అని పెట్టాం అని చెప్పిన రాహుల్.... ప్రధాని మోడీ పేదలకు న్యాయాన్ని చేయడం మర్చిపోయారని ధ్వజమెత్తారు.

దారుణం: జూనియర్‌ను చితక బాదిన సీనియర్లు...బాలుడి మృతదేహాన్ని దాచిన స్కూలు యాజమాన్యందారుణం: జూనియర్‌ను చితక బాదిన సీనియర్లు...బాలుడి మృతదేహాన్ని దాచిన స్కూలు యాజమాన్యం

మోడీ నిర్ణయాలకు అన్ని రంగాల వారు బలయ్యారు

మోడీ నిర్ణయాలకు అన్ని రంగాల వారు బలయ్యారు

రైతులకు కూడా మోడీ ప్రభుత్వం అన్యాయమే చేసిందని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. అంతేకాదు చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు కూడా అన్యాయం చేశారు. ఇక యువతకైతే ఉద్యోగాలు ఇస్తామని వారిని కూడా అన్యాయం చేశారు ప్రధాని మోడీ అని రాహుల్ తెలిపారు. ఈ దేశంలోని తల్లులు, అక్కచెల్లెలు దాచుకున్న డబ్బును పెద్ద నోట్ల రద్దుతో వారి ఆశలను ఆవిరయ్యేలా మోడీ చేశారని మండిపడ్డారు రాహుల్. ఇప్పుడు అదే డబ్బును తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ ఈ కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తోందని వెల్లడించారు.

బడాబాబులకు రూ. 3.5 లక్షల కోట్లు ఇచ్చారు..అదే డబ్బును పేదలకిస్తాం

బడాబాబులకు రూ. 3.5 లక్షల కోట్లు ఇచ్చారు..అదే డబ్బును పేదలకిస్తాం

ఇక న్యాయ్ పథకం పై అధికార పార్టీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ పథకం అమలు చేయడం అసాధ్యమేమీ కాదని ... అయితే బీజేపీ పెద్దనోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే నాశనం చేసిందో అలా జరగబోదని రాహుల్ చెప్పారు. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ చాలామంది ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరిపిందని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మోడీ 15 మంది బడాబాబులకు రూ.3.5 లక్షల కోట్లు ఇవ్వగలిగినప్పుడు పేదలకు ఈ డబ్బులు ఎందుకు ఇవ్వకూడదని రాహుల్ ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలనుంచి కేవలం మోడీకి చెందిన బడా బాబులు లబ్ధి పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్.

 మా మిషన్ పూర్తి చేస్తాం: రాహుల్

మా మిషన్ పూర్తి చేస్తాం: రాహుల్


న్యాయ్ పథకం ఎప్పుడు ఎలా అమలు చేస్తారనేదానిపై మాత్రం రాహుల్ గాంధీ స్పష్టం చేయలేదు. అయితే దీన్ని ఓ పైలట్ ప్రాజెక్టుగా ముందు ప్రారంభించి ఆ తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్ది దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. అంతే కాదు నిజమైన అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేస్తారా అన్న ప్రశ్నకు ...ఇది ఏ రాష్ట్రాల్లో అమలు చేయాలనేది నిపుణుల బృందం నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు రాహుల్. పదేళ్ల కాంగ్రెస్ యూపీఏ పాలనలో 14 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని... ఇప్పుడు తమ కార్యాన్ని పూర్తిగా నెరవేరుస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 20 శాతం నుంచి 22శాతం మంది ప్రజలు పేదరిక రేఖకు దిగువున ఉన్నారని అది అంతా మోడీ పుణ్యమే అని రాహుల్ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతోనే వీరంతా ఇంకా కఠిక పేదరికంలోనే ఉండిపోయారని చెప్పారు. అందుకే న్యాయ్ అనే పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు రాహుల్ వెల్లడించారు.

English summary
Congress President Rahul Gandhi on Thursday said the ‘Nyay’ scheme will remonetise what Prime Minister Narendra Modi demonetised and asserted that his party’s anti-poverty programme has thrown the BJP into total disarray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X