వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తకళలకు మంచిరోజులు: దుబాయ్‌లోలా మెగాషాపింగ్ ఫెస్టివల్స్‌కు కేంద్రం యోచన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుందో అనే వివరాలను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో వివరించారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని చెప్పిన ఆర్థిక మంత్రి...పారిశ్రామిక రంగంలో చాలా మార్పులు ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఆర్థికరంగ బలోపేతం కోసం చర్యలు, ఎఫ్‌డీఐలు మరింత పెరుగతాయని నిర్మలా సంకేతాలుఆర్థికరంగ బలోపేతం కోసం చర్యలు, ఎఫ్‌డీఐలు మరింత పెరుగతాయని నిర్మలా సంకేతాలు

ఎగుమతులకు ఊతం ఇచ్చేలా దుబాయ్‌లో నిర్వహించే మెగా షాపింగ్ ఫెస్టివల్స్‌ను భారత్‌లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారితో కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడటమే కాకుండా వారి ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకునేలా ఈ మెగా షాపింగ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ మెగా షాపింగ్ ఫెస్టివల్‌లో హ్యాండి క్రాఫ్ట్స్, యోగా, టూరిజం, టెక్స్‌టైల్స్, లెదర్ ఉత్పత్తులను ఉంచుతామని చెప్పారు. 2020 మార్చిలో నాలుగు నగరాల్లో మెగా షాపింగ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఇక మెగా షాపింగ్ ఫెస్టివల్ ద్వారా హస్తకళల పరిశ్రమ పుంజుకుంటుందని చెప్పారు.

we will setup 4 Dubai-style mega shopping carnivals:Nirmala Sitharaman

Recommended Video

బ్యాంకుల విలీనాలను ప్రకటించిన నిర్మలా సీతారామన్ || Nirmala Sitharaman Press Meet Highlights

వచ్చే ఏడాది నుంచి వస్త్ర ఎగుమతుల కోసం కొత్త పథకం అమలు చేస్తామని హామీనిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఇండియా స్థానం మరింత మెరుగైందని .. భయపడాల్సిన పరిస్థితి ఏం లేదని చెప్పారు. ఆర్థిక రంగం బలోపేతం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకు ప్రభుత్వ బ్యాంకుల్లో వితరణ లభిస్తోందని చెప్పారు.

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్స్‌ ఎలా ఉంటాయి..?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌ను ఒక నెలరోజుల పాటు నిర్వహిస్తుంది. గత 20 ఏళ్లుగా మెగా షాపింగ్ ఫెస్టివల్స్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. దుబాయ్ రీటెయిల్ వ్యాపారం పుంజుకోవాలన్న ఉద్దేశంతో దుబాయ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఆ తర్వాత ఇది ఒక పర్యాటక ఆకర్షణగా ప్రమోట్ చేశారు. ఇక ఇదే తరహాలో భారత్‌లో కూడా నిర్వహించలాని కేంద్రం భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

English summary
Nirmala Sitharaman said that the Mega shopping festivals in India just like Dubai would be setup for MSMEs to boost exports. A global thrust for people for large scale purchases and for ideas of connection," the FM announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X