వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శశికళ కుటుంబం నుండి పార్టీని లాక్కొంటాం, ధర్మమే గెలుస్తోంది,శశికళపై పన్నీర్ సంచలనం'

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుండి బయటకు పంపించిన వారి చేతుల్లోకి తిరిగి పార్టీ వెళ్ళిందని

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయటకు పార్టీ నుండి బయటకు పంపించిన వారి చేతుల్లోకి తిరిగి పార్టీ వెళ్ళిందని, వారి కబంధ హస్తాల నుండి పార్టీని తిరిగి తెచ్చుకొంటామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం ఇంకా మిస్టరీగానే ఉందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడ ఇదే విషయాన్ని అడుగుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ జయలలిత మరణం గురించి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పన్నీర్ సెల్వం ను పార్టీ నుండి బహిష్కరించింది శశికళ.పోయేస్ గార్డెన్ నుండి జయలలిత బయటకు పంపించినవారు ప్రస్తుతం అన్నాడిఎంకె ను నడుపుతున్నారని ఆయన చెప్పారు.

We will take back AIADMK from the hands of one family: Panneerselvam

జయలలిత చేత బయటకు గెంటివేయబడిన వారి నుండి పార్టీని రక్షించుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ధర్మ యుద్దం ఖచ్చితంగా గెలుస్తోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి కుటుంబ రాజకీయాలు లేకుండా అమ్మ తీర్చిదిద్దారని ఆయన చెప్పారు.

తమిళనాడు ప్రభుత్వం పార్టీ ఒక కుటుంబం చేతిలోనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్నాడిఎంకెలో శశికళ కుటుంబం మళ్ళీ చక్రం తిప్పడం ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు.

అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తన అక్క కొడుకు దినకరన్ కు పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది.తాను జైలుకు వెళ్ళే రోజు ఉదయాన్నే అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ ను నియమిస్తూ శశికళ ఉత్తర్వులిచ్చారు.గురువారం నాడు దినకరన్ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు.

English summary
The former Chief Minister of Tamil Nadu, O. Panneerselvam, on Friday said the former Chief Minister Jayalalithaa was the one who helped increase the party membership from 14 lakh to 1.5 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X