• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డబ్బున్న బిచ్చగాళ్ళు ...వాళ్ళ దగ్గర డబ్బు చూసి షాక్ అయిన పోలీసులు

|

బిచ్చగాళ్ళు... వాళ్ల దగ్గర ఏముంటాయిలే అని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. యాచకుల దగ్గర ఊహించని విధంగా డబ్బుల కట్టలు బయట పడుతున్న టువంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు బిచ్చగాళ్ళు కూడా తాము భిక్షాటన చేయగా సంపాదించిన దాన్ని చాలా జాగ్రత్తగా మూట కడుతున్నారు అని.

<strong>విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు</strong>విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు

ఇద్దరు బిచ్చగాళ్ళు మృతి.. ఒకరు లక్షాధికారి, ఇంకొకరు కోటీశ్వరుడు

ఇద్దరు బిచ్చగాళ్ళు మృతి.. ఒకరు లక్షాధికారి, ఇంకొకరు కోటీశ్వరుడు

ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తాజాగా ఇద్దరు బిచ్చగాళ్ళు మృతి చెందితే అందులో ఒకరు లక్షాధికారి, మరొకరు కోటీశ్వరుడు అని తేలింది. ఇక వారి మరణం తర్వాత మాత్రమే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక ఈ వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి గట్టుపై మార్కండేయేశ్వర స్వామి ఆలయ సమీపంలో భిక్షాటన చేసే బిచ్చగాడు మృతి చెందాడు. ఎంతో కాలంగా అక్కడ యాచన జీవనాధారంగా బ్రతుకుతున్న 70 ఏళ్ల వయసున్న ఆ వృద్ధుడు అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడ్డాడు. యాచకుడు మృతితో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఇక ఆ సమయంలో అతడి సంచిని పరిశీలించగా అతని సంచిలో లక్ష రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు గా పోలీసులు గుర్తించారు.

బిచ్చగాడి దగ్గర ఏకంగా రూ. 1.86 కోట్లకు పైగా డబ్బు ... షాక్ అయిన పోలీసులు

బిచ్చగాడి దగ్గర ఏకంగా రూ. 1.86 కోట్లకు పైగా డబ్బు ... షాక్ అయిన పోలీసులు

ఇక ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో మరో బిచ్చగాడి దగ్గర ఏకంగా రూ. 1.86 కోట్లకు పైగా డబ్బు ఉండడం ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన అక్కడ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది అరవన్నామలై ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ భిక్షకుడు మృతి చెందాడు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని తరలించి, అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించి బిత్తరపోయారు. అందులో పెద్దమొత్తంలో డబ్బుంది. ఆ డబ్బును అక్కడికక్కడే లెక్కించారు. మొత్తం రూ. 1,86,43,364 నగదును పోలీసులు గుర్తించారు. అయితే అంత డబ్బున్న కోటీశ్వరుడైన అతను ఇంకా భిక్షాటనే ఎందుకు చేస్తున్నాడన్నది పోలీసులకు అర్థం కాలేదు.

బిచ్చగాళ్ళు తక్కువేం కాదు .. చాలా మంది బిలియనీర్లే

బిచ్చగాళ్ళు తక్కువేం కాదు .. చాలా మంది బిలియనీర్లే

ఇక ఈ రెండు సంఘటనలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చాలాచోట్ల యాచకుల మరణానంతరం వారు దాచి పెట్టుకున్న నగదు పెద్ద మొత్తంలో ఉండటం చూసి అందరూ అవాక్కవుతున్న పరిస్థితి ఉంది.
ఇక భిక్షాటన వృత్తిగా ఎంచుకుని చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా సంపాదనలో ఏ మాత్రం తీసిపోవటం లేదని లెక్కలు చెప్తున్నాయి. చాలా మంది బిచ్చగాళ్ళు వాళ్ళ మరణం తర్వాత బిలియనీర్లు అని తెలుస్తున్న పరిస్థితులు భిక్షాటన చేసే ఇంత సంపాదించారా అన్న ఆలోచన అందరికీ కలుగుతుంది .

English summary
Recently, two beggars have died, one of them a millionaire and the other a billionaire. It was only after their death that these things came to light. If you go to the details, a beggar dies in the Godavari mound of Rajahmundry in the East Godavari district and he has a lakh of cash. In Tamil Nadu, a beggar died in Aravannamalai area. He has more than 1.86 crore cash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X