వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీట్ బెల్ట్ పెట్టుకుంటే ముండే బతికేవాడు: హర్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీటు బెల్టు పెట్టుకుని ఉంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపినాథ్ ముండే బతికి ఉండేవారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రధానమైన ప్రచార కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రకటించారు.

సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ముండే బతికి ఉండేవారని, తన మిత్రుడు తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని, బ్యాక్ సీట్ బెల్టులు అలంకరణ కోసమేనని చాలా మంది భావిస్తారని, అవి ప్రాణాలను రక్షిస్తాయని ఆయన అన్నారు.

Wearing Seat Belt Could Have Saved Gopinath Munde: Harsh Vardhan

ముండే అంత్యక్రియల్లో పాల్గొడనానికి బీడ్‌కు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ముండేకు శరీరంలో లోపల పలు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు తెలియజెప్పేందుకు కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు.

ప్రమాదాల్లో చిన్నారి బాధితులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామని, రెడ్ లైట్‌ను జంప్ చేసి మోటరిస్టు దూసుకుపోవడంతో జరిగిన ప్రమాదంలో ముండే క్షణాల్లో మరణించారని ఆయన చెప్పారు.

English summary
Wearing seat belt could have saved Rural Development Minister Gopinath Munde who died in a road accident, Union Health Minister Harsh Vardhan today said and announced a major campaign to spread awareness on observing safety measures while driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X