Wedding dance: పెళ్లిసందడి, డ్యాన్స్ చేస్తూ ప్రాణం వదిలేసిన ఆంటీ, పెళ్లి ఇంట్లో కొన్ని గంటల ముందు!
అహమ్మదాబాద్/ గుజరాత్: పెళ్లి ఇంట్లో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెతో పాటు అందరూ సందడి చేస్తున్నారు. బంధువులు అందరూ పెళ్లి ఇంటికి చేరుకోవడంతో సందడి మొదలైయ్యింది. ముహూర్తం ముందు రోజు రాత్రి ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అందరూ వారికి నచ్చిన పాటలకు డ్యాన్స్ లు వేస్తున్నారు. పెళ్లికి వెళ్లిన ఆంటీ మంచి ఊపు ఉన్న పాటకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. తరువాత ఆంటీకి గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో పెళ్లి ఇంట్లో కొన్ని గంటల మందు విషాదచాయలు నెలకొన్నాయి.

గాంధీనగర్ లో పెళ్లి
గుజరాత్ లోని గాంధీనగర్ లో యువతి, యువకుడి పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు బంధువులు అందరికీ పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె సమీప బంధువులు కావడంతో పెళ్లిసందడి మొదలైయ్యింది. సొంత ఊర్లో పెళ్లి కావడంతో బంధువులతో పాటు ఊరి ప్రజలు అందరూ సంతోషంగా రాత్రి భోజనం చేశారు.

రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్
గుజరాత్ సాంప్రధాయం ప్రకారం పెళ్లి ముహూర్తానికి ముందు రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. ఇదే పెళ్లికి కల్పనా బెన్ (45) అనే మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. రాత్రి బంధువులు, సాటి మహిళలతో కలిసి కల్పనా బెన్ డ్యాన్స్ వెయ్యడానికి పెళ్లి జరుగుతున్న వేదిక ముందు రోడ్డులోకి వెళ్లింది. కల్పనా బెన్ తో పాటు ఆమె వెంట కొడుకు వెళ్లాడు.

డ్యాన్స్ చేస్తుంటే ప్రాణం పోయింది
అందరితో కలిసి డ్యాన్స్ చేస్తున్న కల్పనా బెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కనే స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న కల్పనా బెన్ కొడుకుతో పాటు ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సాటి మహిళలు షాక్ కు గురైనారు. వెంటనే కల్పనా బెన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కల్పనా బెన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు. కల్పనా బెన్ కు గుండెపోటు రావడం వలనే కుప్పకూలి ప్రాణాలు వదిలిందని బంధువులు తెలిపారు. పెళ్లికి కొన్ని గంటల ముందు కల్పనా బెన్ ప్రాణాలు పోవడంతో పెళ్లి ఇంట విషాదచాయలు నెలకొన్నాయి.