వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగా పెరిగిన యూట్యూబ్ గిరాకీ ... కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే !!

|
Google Oneindia TeluguNews

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద దారుణంగా పడినా యూట్యూబ్ కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిన వాళ్ళు యూట్యూబ్ లో తమకు కావాల్సిన వీడియోలు తెగ చూసేస్తున్నారు . లాక్‌డౌన్‌తో అత్యవసర సేవలు మినహా అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీగా కూర్చోలేక యూట్యూబ్ వీడియో లతో టైం పాస్ చేస్తున్నారు. వంటలు, లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ , పాటలు, సినిమాలు ఇలా ఒకటేమిటి యూట్యూబ్ ను తెగ జల్లెడపడుతున్నారు.

ఏపీ తీరప్రాంత ఉప్పు రైతులకు ఈ ఏడాది కష్టమే: కరోనా లాక్ డౌన్ తో తీరని నష్టమే !!ఏపీ తీరప్రాంత ఉప్పు రైతులకు ఈ ఏడాది కష్టమే: కరోనా లాక్ డౌన్ తో తీరని నష్టమే !!

నెలకు రెండు బిలియన్లకు పైగా ప్రేక్షకులకు చేరుతున్న యూ ట్యూబ్

నెలకు రెండు బిలియన్లకు పైగా ప్రేక్షకులకు చేరుతున్న యూ ట్యూబ్

యూట్యూబ్ నెలకు రెండు బిలియన్లకు పైగా ప్రేక్షకులను చేరుకుంటుంది అని యూ ట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ పేర్కొన్నారు. . గత ఏడాది ఇదే సమయంలో య్యూటూబ్‌లో వార్తలు వీక్షించేవారి సంఖ్య ఇటీవలితో పోల్చి చూస్తే చాలా తక్కువ ఉంది. ఇక ఈ సారి మాత్రం అమాంతం 75 శాతం పెరిగిపోయింది. కరోనావైరస్ తాజా అప్‌డేట్స్ కోసం మిలియన్ల మంది ప్రజలు యూ ట్యూబ్ వీడియోల వైపు మొగ్గు చూపుతున్నారని య్యూట్యూబ్‌ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ బ్లూమ్‌బెర్గ్ తెలిపారు.

 కరోనా వైరస్ ప్రభావంతో యూట్యూబ్ కు గణనీయంగా పెరిగిన ట్రాఫిక్

కరోనా వైరస్ ప్రభావంతో యూట్యూబ్ కు గణనీయంగా పెరిగిన ట్రాఫిక్

కరోనా వైరస్ ఎప్పుడైతే ప్రభావం మొదలు పెట్టిందో అప్పటి నుండి యూట్యూబ్ కు గణనీయమైన ట్రాఫిక్ పెరిగింది. యూట్యూబ్ లో ప్రజలు వివిధ వీడియోల వీక్షణలో పెరుగుదల ఉన్నప్పటికీ, యూట్యూబ్, ఇతర పెద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే, దాని మార్కెటింగ్ క్లయింట్లు చాలా మంది బడ్జెట్‌లను తగ్గించడంతో ప్రకటనల వ్యయంలో తగ్గుదల ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రకటనల వ్యయంలో తగ్గుదల 8 శాతానికి పడిపోయిందని తెలుస్తుంది. అయితే, అది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి సంస్థ నిరాకరిస్తుంది .

వ్యూవర్ షిప్ 75% పెరిగిందని యూట్యూబ్ వెల్లడి

వ్యూవర్ షిప్ 75% పెరిగిందని యూట్యూబ్ వెల్లడి

ప్రపంచం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతుండటంతో, ఇటీవల సైట్‌లోని వార్తల కంటెంట్ వీక్షకుల సంఖ్య గణనీయంగా 75% పెరిగిందని యూట్యూబ్ వెల్లడించింది.ఇతర సామాజిక సైట్ల మాదిరిగానే, తప్పుదోవ పట్టించే మరియు తప్పుడు వీడియోల వ్యాప్తిని అరికట్టటం కోసం యూట్యూబ్ ప్రయత్నిస్తోంది. తప్పు సమాచారంఉన్నది అని భావించిన, నిబంధనలను ఉల్లంఘించిన వేలాది వీడియోలను ఇది తీసివేస్తుందని , ఇది ఒక పెద్ద టాస్క్ గా మారిందని పేర్కొంది యూట్యూబ్ .

English summary
With the world battling the coronavirus pandemic, YouTube has revealed that viewership of news content on the site has skyrocketed by 75% in recent weeks. chief product officer Neal Mohan said that viewers are “trying to consume as much information around this crisis – tt’s top of mind for everybody.”While Mohan did not share the actual number of views, Google had previously noted that it reaches more than two billion viewers a month.News content on YouTube is ranked by its “authoritativeness”, the company had said, utilising a combination of human judgement and automation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X