వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: తెల్లవారు జామున కురుస్తోన్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమౌతోంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకున్నప్పటికీ.. వాహనదారులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాటి తీవ్రత మరింత పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా

ఈ ప్రమాదానికి పొగమంచు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జల్‌పాయ్‌గురి జిల్లాలోని ధుప్‌గురిలో ఈ దుర్ఘటన సంభవించింది. జల్‌పాయ్‌గురి నుంచి అలీపూర్‌దౌర్ వైపు వెళ్తోన్న డబ్ల్యూబీ 72 ఆర్ 1688 నంబర్ గల వాహనం మార్గమధ్యలో ధుప్‌గురి వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి కంకర, బండరాళ్ల లోడుతో వెళ్తోన్న ఓ భారీ వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వాహనంలో ప్రయాణిస్తోన్న వారిలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో ఈ వాహనంలో 18 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

 West Bengal: 13 people died in an accident in Jalpaiguri district last night, due to fog

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఢీ కొట్టిన వేగానికి బండరాళ్లు, కంకర.. ఆ వాహనంపై పడటంతో అది నుజ్జునుజ్జయింది. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడ్డ వారిని ధుప్‌గురి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మిగిలిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం జల్‌పాయ్‌గురికి తరలించినట్లు పేర్కొన్నారు.

 West Bengal: 13 people died in an accident in Jalpaiguri district last night, due to fog

దట్టమైన పొగమంచు వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచు తెరల వల్ల ఎదురుగా ఉన్న వాహనాల వేగాన్ని, దూరాన్ని డ్రైవర్లు అంచనా వేయలేకపోతోన్నారని, ఫలితంగా రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని అన్నారు. పొగమంచు కురుస్తోన్న సమయంలో వాహనాలను నెమ్మదిగా నడిపించాలంటూ జాతీయ రహదారుల వెంబడి ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, మైక్‌ల ద్వారా ప్రకటనలను జారీ చేస్తన్నామని, టోల్‌గేట్ల వద్ద తరచూ తనిఖీలను నిర్వహిస్తుెన్నామని అయినప్పటికీ.. ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

English summary
West Bengal: 13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district last night, due to reduced visibility caused due to fog. The injured were taken to a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X