వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూతన మోటార్ చట్టం అమలుకు నిరాకరించిన దీదీ & మధ్యప్రదేశ్ , పరీశీలనలో తెలుగు రాష్ట్రాలు

|
Google Oneindia TeluguNews

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్ట సవరణను పశ్చిమ బెంగాల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్నాయంటూ ఆయా రాష్ట్రాల్లో అమలు పరిచేందుకు నిరాకరించాయి. కాగా రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం కేంద్రం విధించిన జరిమానాలపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది. అనంతరం చట్టంపై చర్యలు చేపట్టనుంది. అయితే తెలంగాణ రాష్ట్రం దీనిపై ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదు.

<strong>ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్</strong> ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్

రహదారి భద్రతపై కేంద్రం నూతన చట్టం

రహదారి భద్రతపై కేంద్రం నూతన చట్టం

రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదాలు, మరణాల నియంత్ర కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారువాహానాల చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ సవరణ బిల్లు నేటి నుండి అమలులోకి రానుంది. ఇందుకోసం కేంద్రం నోటిఫికేషన్ కూడ విడుదల చేసింది.ఇందులో భాగంగానే ట్రాఫిక్ నిబంధనలు, వాహానాల చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై భారిగానే జరిమానాలు విధించింది. అయితే ఈ చట్టం అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద అధారపడి ఉంటుంది. ఈనేపథ్యంలోనే మమతా సర్కార్ కేంద్ర చట్టాన్ని అమలు చేసేందుకు నిరాకరించింది.

కొత్త చట్టంలో భారీ జరిమానాలు

కొత్త చట్టంలో భారీ జరిమానాలు

ఇక కేంద్ర తీసుకువచ్చిన చట్టంలో భారీ ఎత్తున జరిమానాలు తీసుకువచ్చింది. ముఖ్యంగా లైసెన్స్ లేకుంటే 50000 , హెల్మెంటే లేకుండా నడిపితే 2000 ,సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే 1000 రుపాయాల జరిమానా కాగా మద్యం సేవించి పట్టుపడినా, అత్యవసర వాహానాలకు దారి ఇవ్వకున్నా పదివేల రుపాయాల జరిమాన విధించనున్నారు. మరోవైపు అతివేగం తో పట్టుపడిన వాహానాలకు కూడ రూ 2000 జరిమాన విధించనున్నారు.

చట్టం అమలుపై నిర్ణయం తీసుకొని తెలుగు రాష్ట్రాలు,

చట్టం అమలుపై నిర్ణయం తీసుకొని తెలుగు రాష్ట్రాలు,

ఇక మోటారు వెహికిల్ సవరణ చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా కేంద్రం చేపట్టిన చట్టాన్ని యథావిధిగా లేదా జరిమానాలపై సమీక్ష జరిపిన తర్వాతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ చట్టం నేటి నుండి అమల్లోకి రానుండడంతో తెలంగాణలోగాని ఏపీలో గాని ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదు. ఈచట్టంపై ముందుగా రవాణశాఖ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఆయా ప్రభుత్వాల సీఎంల నిర్ణయాన్ని బట్టి అమలు చేయనున్నాయి.. ఇందుకోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
west Bengal and Madhya Pradesh have refused to implement stricter Central Motor Vehicles Amendment Act at the moment, citing differences over the amount of penalty on traffic violations. Rajasthan, on the other hand, said it will take a call after reviewing the penalty amount, according to the state transport minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X