• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీదీగిరికి అడ్డులేదిక: శాసన మండలి బిల్లుకు ఆమోదం -మోదీ-బీజేపీకి మండేలా ఏటా ‘ఖేల హోబే దివస్’

|

బీజేపీలో అంతర్గత సంక్షోభాన్ని కూడా ప్రత్యర్థులపై అస్త్రంగా వక్రీకరిస్తూ గోదీ మీడియా చేసిన ప్రచారం పటాపంచలైంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికే ఉత్తరాఖండ్ లో బీజేపీ తన ముఖ్యమంత్రిని మార్చిందనే వాదన గాలికికొట్టుకుపోయిందిప్పుడు. పశ్చిమ బెంగాల్ లో దీదీగిరి సాఫీగా కొనసాగేలా శాసన మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మండలి పునరుద్దరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీజేపీని మరింత ఉడకిస్తూ ఇకపై ఏటేటా ఖేలా హోబే దినోత్సవాలు జరుపుతామని సీఎం ప్రకటించారు..

రామా అన్న పదం కూడా బూతుగా? -అసదుద్దీన్ ఓవైసీ కంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ క్రిమినలా?: విజయశాంతిరామా అన్న పదం కూడా బూతుగా? -అసదుద్దీన్ ఓవైసీ కంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ క్రిమినలా?: విజయశాంతి

శాసన మండలి బిల్లు పాస్

శాసన మండలి బిల్లు పాస్

రెండు నెలల కిందట హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 294 సీట్లకుగానూ టీఎంసీ 211 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 74 సీట్లకే పరిమితమైంది. కానీ అనూహ్యరీతిలో నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీ ఓడిపోయారు. చట్టసభలో సభ్యురాలు కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీదీ.. ఆరు నెలల్లోగా, అంటే ఈఏడాది నవంబర్‌లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. దీంతో ఎప్పుడో రద్దయిన శాసన మండలిని మళ్లీ పునరుద్ధరించాలని మమత డిసైడయ్యారు. ఆ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసనసభలో ఆమోదం లభించింది..

షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలుషాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు

196-69తేడా, బీజేపీ వాకౌట్..

196-69తేడా, బీజేపీ వాకౌట్..

శాసన మండలి పునరుద్ధరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. దొడ్డి దారిన సీఎంగా కొనసాగేందుకే దీదీ మండలిని మళ్లీ తీసుకొచ్చారని, మండళ్ల ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకమని, అన్నిటికంటే ముందు నందిగ్రామ్ లో మమత ఓటమిపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి పట్టుపట్టారు. వాదోపవాదాల మధ్యే మండలి ఏర్పాటు బిల్లు 196-69 తేడాతో ఆమోదం పొందింది. ఈ ఘట్టం తర్వాత సీఎం మమత ప్రసంగం ఉండగా దాన్ని నిరసిస్తూ బీజేపీ వాకౌట్ చేసింది. కాగా,

బెంగాల్‌లో ఏటా ఖేలా హోబే దివస్

బెంగాల్‌లో ఏటా ఖేలా హోబే దివస్

మండలి బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ శాసన మండళ్లు కొనసాగుతున్నాయని, అలాంటిది బెంగాల్ లో మాత్రమే వారు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలిపై టీఎంసీ తన మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. బెంగాల్ ప్రజలు టీఎంసీని ఆశీర్వదించిన తీరు అమోఘమని, ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ‘ఖేలా హోబే దివస్' జరపాలని నిర్ణయించినట్లు మమత తెలిపారు. బీజేపీ జైశ్రీరాం నినాదాంతో మమతపై దాడికి దిగగా, టీఎంసీ ఖేలా హోబే(ఆట ఇంకా మిగిలే ఉంది) నినాదంతో కమలనాథుల్ని మట్టికరిపించడం తెలిసిందే.

English summary
Chief Minister Mamata Banerjee-led West Bengal Cabinet on Tuesday passed the West Bengal Legislative Council resolution. The cabinet passed a resolution to create a Legislative Council in the state under Article 169 of the Constitution of India. According to reports, a total of 196 of 265 members West Bengal assembly supported the resolution while 69 voted against it. cm mamata also announced to celebrate ‘Khela Hobe Diwas’ every year in the state. She, however, didn’t mention the date, announcing to declare it in the coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X