• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాలోనూ కుమ్మేశారు: బెంగాల్ ఏడో దశలో భారీ పోలింగ్ -కోల్‌కతాలో అత్యల్పం -దీదీపై నడ్డా ఫైర్

|

కరోనా వైరస్ విజృంభిస్తున్నా పశ్చమ బెంగాల్ లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఏడవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. కాగా, ఈసారి కూడా పోలింగ్ శాతం భారీగా నమోదైంది..

వ్యాక్సిన్ ధరలను తగ్గించండి ప్లీజ్ -సీరం, భారత్ బయోటెక్‌కు మోదీ సర్కార్ విన్నపం -మాట వింటారా?వ్యాక్సిన్ ధరలను తగ్గించండి ప్లీజ్ -సీరం, భారత్ బయోటెక్‌కు మోదీ సర్కార్ విన్నపం -మాట వింటారా?

ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం, సాయంత్రం 5 గంటల సమయానికే పోలింగ్ శాతం 75.06గా ఉంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పూర్తి లెక్కలు కలిపితే, ఏకంగా 81.05 శాతం ఓటింగ్ నమోదైందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తం 34 నియోజకవర్గాల్లోని 11,376 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. కోల్ కతా సిటీలో మాత్రం అత్యల్పంగా 60.03 శాతం ఓటింగ్ నమోదైంది.

West Bengal assembly elections: above 81 percent voter turnout recorded in 7th phase

ఏడో దశ పోలింగ్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె త‌న ఓటు వేశారు. కాలుకు గాయం కార‌ణంగా గ‌త నెల‌రోజుల‌కు పైగా వీల్ చైర్‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన మ‌మ‌తాబెన‌ర్జి.. ఇవాళ ఓటేసేందుకు కూడా వీల్ చైర్‌లోనే పోలింగ్ బూత్‌కు వ‌చ్చారు. ఓటేసి బ‌య‌టికి వ‌చ్చిన అనంత‌రం ఆమె వీల్ చైర్‌లో కూర్చునే అభిమానుల‌కు విక్టరీ సింబ‌ల్ చూపించారు. కాగా,

జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలుజస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు

  Oxygen Crisis : Centre Exempts Customs Duty on Vaccines, Oxygen For 3 Months || Oneindia Telugu

  కరోనా నేపథ్యంలో ఈసీ విధించిన షరతులకు లోబడి బీజేపీ వ్యవహరించిందని, మమత నేతృత్వంలోని టీఎంసీ మాత్రం అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అనంతరం మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.

  English summary
  The seventh phase of West Bengal assembly polls was held peacefully with an estimated voter turnout of 75.06 per cent till 5 pm on Monday, according to the Election Commission. in the final figure above 81 percent voter turnout recorded. Among the 34 constituencies that went to polls in Phase-VII, six are in Dakshin Dinajpur, six in Malda, nine in Murshidabad, nine in Paschim Bardhaman and four in Kolkata.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X