వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుక్క మాంసం తినండి, సూపర్ టేస్ట్, ఆ కిక్కే వేరప్ప, విదేశీ పెళ్లాలు, శవాలు కూడా చిక్కవు!

|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ముందు వరుసలో ఉంటారు. గోవు మాంసం కాకపోతే కుక్క మాంసం తినండి, చాల రుచిగా ఉంటుంది, కుక్క మాంసం తింటే ఆ కిక్కే వేరప్ప అంటూ మరోసారి దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్క మాంసం తింటే మీ ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని గోవు మాంసం తినేవారి తరపున వాదిస్తున్న నాయకులు, పలు సంఘాల నాయకులకు దిలీప్ ఘోష్ చురకలు అంటించారు. మీకు ఏ మాంసం అయినా ఒక్కటే కదా, కుక్క మాంసం తినడానికి కూడా వెనక్కిపోరని గోవు మాంసం తినే వారి మీద దిలీప్ ఘోష్ మండిపడుతున్నారు.

భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే!భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే!

విదేశీ కుక్కలు, మీరు అఫిషియల్స్!

విదేశీ కుక్కలు, మీరు అఫిషియల్స్!

బుద్వాన్ లో గో అష్టమి కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడారు. పలువురు రోడ్ల మీద విచ్చలవిడిగా గోవు మాంసం విక్రయిస్తున్నారని, అక్కడే తింటున్నారని దిలీప్ ఘోష్ విచారం వ్యక్తం చేశారు. అదే జనాలు విదేశాల నుంచి తీసుకు వచ్చిన కుక్కల మలమూత్రాలను శుభ్రం చేసి మామే చాల గొప్ప వ్యక్తులు, శ్రీమంతులు (అఫిషియల్స్) అని గొప్పగా చెప్పుకుంటున్నారని, వారికి ఏమైనా సిగ్గూ శరం ఉందా అని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు.

మీ ఇంట్లో ఏ మాంసం అయినా తినండి

మీ ఇంట్లో ఏ మాంసం అయినా తినండి

మీ ఇంట్లో గోవు మాంసం తినండి, అంతే కుండా కుక్క మాంసంతో పాటు అనేక జంతువుల మాంసం తినండి. అంతే కాని రోడ్ల మీదకు రాకండి అని దిలీప్ ఘోష్ సూచించారు. అయితే గోవులను హత్య చేస్తే తాము చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ది చెబుతామని ఓ వర్గం ప్రజలను దిలీప్ ఘోష్ హెచ్చరించారు.

 గోవులు తల్లితో సమానం

గోవులు తల్లితో సమానం

భారతదేశం గోపాలుడి (కృష్ణుడు) జన్మస్థలం. భారతదేశంలో గోవులకు ఎంతో గౌరవం ఉంది. గోమాతలను హత్య చెయ్యడం అత్యంత హీనమైన చర్య, అందుకే మేము గోహత్యలను వ్యతిరేకిస్తున్నామని దిలీప్ ఘోష్ అన్నారు. తల్లి పాలు తరువాత తాము గోవు పాలు తాగి బతుకుతున్నామని, గోవులు తమకు తల్లితో సమానమని దిలీప్ ఘోష్ చెప్పారు. అందుకే తాము గో హత్యలను వ్యతిరేకిస్తున్నామని, ఎవరైనా గోవులను హత్య చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ది చెబుతామని దిలీప్ ఘోష్ హెచ్చరించారు.

కుక్క మాంసం చాల టేస్ట్, ఆకిక్కే వేరప్ప!

కుక్క మాంసం చాల టేస్ట్, ఆకిక్కే వేరప్ప!

భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి సమాజం, సంసృతి, కట్టుబాట్లను విదేశీయులు ఎంతో గౌరవిస్తారని దిలీప్ ఘోష్ గుర్తు చేశారు. గోవు మాంసం ఎందుకు ? మీరు కుక్క మాంసం తినండి, చాలా టేష్ట్ గా ఉంటుంది, మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు, కుక్క మాంసం తినకూడదని మీకు ఎవరు అభ్యంతరం చెబుతున్నారా ? అని దిలీప్ ఘోష్ వ్యంగంగా అన్నారు.

కుక్కలు కాకపోతే ఏమైనా!

కుక్కలు కాకపోతే ఏమైనా!

మీ ఇంట్లో కుక్క మాంసం కాకుంటే ఏ జంతువుల మాంసం తిన్నా మేము వద్దని చెప్పమని, అయితే రోడ్ల మీద గోవు మాంసం తింటే సహించమని దిలీప్ ఘోష్ హెచ్చరించారు. విదేశీ కుక్కలను ఇంట్లో పెంచుకుని వాటి మలమూత్రాలు శుభ్రం చేసి మేము చాలా గ్రేట్ అంటూ సంకలు గుద్దుకుంటున్నారని, అదే కుక్క మాంసం మీరు ఎందుకు తినడం లేదని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు.

విదేశీ పెళ్లాలు కావాలా?

విదేశీ పెళ్లాలు కావాలా?

భారతదేశంలోని గోవులు మాకు తల్లితో సమానం, విదేశీ గోవులు మాకు తల్లితో సమానం కాదని దిలీప్ ఘోష్ అన్నారు. భారతదేశంలోని గోవులు ఇచ్చే పాలు బంగారం లాగా ఉంటాయని, విదేశాల గోవులు ఇచ్చే పాలకు, భారతదేశంలోని గోవులు ఇచ్చే పాలకు ఎంతో తేడా ఉందని దిలీప్ ఘోష్ అన్నారు. విదేశాల నుంచి భార్యలను తెచ్చుకునే చాల మంది బతుకులు నేడు ఏమైనాయని, వారు ఎంతో కష్టకాలంలో ఉన్నారని దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీ శవాలు కూడా చిక్కవు అంతే!

మీ శవాలు కూడా చిక్కవు అంతే!

గత ఆగష్టు 27వ తేదీన మిడ్నాపుర్ లోచి మేచాడలో దిలీప్ ఘోష్ ఓ పోలీసు అధికారిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. జిల్లాలో మా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు వేధింపులు ఎక్కువ అయ్యాయని, మీరు ఇలాగే ప్రవర్తిస్తే మీ శవాలు కూడా చిక్కకుండా చేస్తామని, మీ కుటుంబ సభ్యులు మీకు అంత్యక్రియలు చెయ్యడానికి శరీరాలు చిక్కకుండా చేస్తామని దిలీప్ ఘోష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

English summary
New Delhi: West Bengal BJP President Dilip Ghosh on Monday attacked intellectuals who eat beef and asked them to eat dog meat also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X