వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు ముకుల్ రాయ్, కైలాష్ విజయ్ వర్గియా సమక్షంలో భారతీ ఘోష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

చోరీలు, అపరాధాలు చేశారని ఆరోపిస్తూ భారతి ఘోష్ మీద సీఐడి అధికారులు నిఘా వేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సన్నిహితంగా ఉన్న భారతీ ఘోష్ 2014 ఆగస్టు 15వ తేదీన సేవా పథకం అందుకున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో, 2016లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పని చేశారని భారతీ ఘోష్ ప్రశంసలు అందుకున్నారు.

West Bengal former IPS officer Bharati Ghosh joins Bharatiya Janata Party

పశ్చిమ మిడ్వాపూర్ ఎస్పీగా భారతీ ఘోష్ ఆరు సంవత్సరాలు పని చేశారు. అనంతరం రిజర్వ్ పోలీసు 3వ బెటాలియన్ కు భారతీ ఘోష్ బదిలి అయ్యారు. భారతీ ఘోష్ ను పార్టీలోకి స్వాగతించిన బీజేపీ నాయకులు తమ పార్టీ పశ్చిమ బెంగాల్ లో రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు.

గత పంవత్పరం ఫిబ్రవరిలో చందన్ మజి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ తో సహ 8 మంది మీద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భారతీ ఘోష్ తో సహ 8 మంది మాయం అయ్యారని సీఐడీ అధికారులు మిడ్వాపూర్ లోని ఫతల్ న్యాయస్థానంలో చార్జ్ షీట్ సమర్పించారు.

సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు గురించి భారతీ ఘోష్ ఓ ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడారు. సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నట్లు తాను ఎక్కడికి పారిపోలేదని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని భారతీ ఘోష అన్నారు. సుప్రీం కోర్టు కూడా తనను అరెస్టు చెయ్యరాదని ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రజల ముందు తనను చులకన చెయ్యాలని ఇలా ప్రచారం చేస్తున్నారని భారతీ ఘోష్ ఆరోపించారు.

English summary
Former IPS officer Bharati Ghosh joins Bharatiya Janata Party (BJP) in presence of Union Minister Ravi Shankar Prasad and BJP leaders Kailash Vijayvargiya & Mukul Roy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X