వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో ''బెంగాల్'' సెగ.. దద్ధరిల్లిన ఉభయసభలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్ గవర్నమెంట్ పై ఆరోపణలు చేయడం చర్చానీయాంశమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ దీదీ దీక్షకు దిగడంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు.

west bengal issue in parliament

బెంగాల్ సెగ పార్లమెంట్ ను తాకడంతో ఉభయసభలు దద్ధరిల్లాయి. బెంగాల్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభా సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆజమాయిషీ సరికాదని వ్యాఖ్యానించారు. తృణమూల్ నేతలకు మద్దతుగా విపక్షాలు కూడా జై కొట్టాయి. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.

English summary
West Bengal issue hit the national capital. The Cold War, which is going Modi versus didi, has moved to Parliament. Trinamool Congress MP's protested against to central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X