వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీకి మరో షాక్: టీఎంసీకి మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామా

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. తాజాగా, మరో రాష్ట్ర మంత్రి అధికార టీఎంసీని వీడారు. పశ్చిమబెంగాల్ క్రీడా మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా మంగళవారం టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు.

అక్షర గౌడ క్లీవేజ్ షో.. ఆ అందాలను మీరే చూడండి..

గతంలో బెంగాల్ రంజీ టీం కెప్టెన్‌గా చేసిన శుక్లా.. హౌరా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. 39 ఏళ్ల ఈ మంత్రి తన రాజీనామా లేఖను మమతా బెనర్జీతోపాటు గవర్నర్ జగదీప్ ధనకర్‌కు పంపారు. తాను రాజకీయాల నుంచి విరమణ తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ లేఖలో శుక్లా పేర్కొన్నారు.

 West Bengal: Minister Laxmi Ratan Shukla resigns

అయితే, లక్ష్మీ రతన్ శుక్లా మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ స్పందిస్తూ రతన్ శుక్లా ఓ మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన తిరిగి క్రీడా రంగంలోకి వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. శుక్లా రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే శుక్లా రాజీనామా లేఖను తాను గవర్నర్‌‌కు పంపినట్లు బెనర్జీ తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పినట్లు మమతా బెనర్జీ తెలిపారు. కాగా, లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేస్తారని బీజేపీ నేత అమిత్ మాల్వీయా ముందే చెప్పడం గమనార్హం. సువేందు అధికారి రాజీనామా తర్వాత మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామా చేయడంతో మమత మంత్రి వర్గంలో రెండు పదువులు ఖాళీ అయ్యాయి.

English summary
In yet another setback for West Bengal Chief Minister Mamata Banerjee ahead of 2021 West Bengal Assembly Elections, Minister of State for Department of Youth Services and Sports Laxmi Ratan Shukla on Tuesday resigned from his post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X