వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ కర్ణన్ అదృశ్యం.. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? పోలీసులకు చుక్కలు!

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, లేదు పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారన

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారని మరోపక్క బుధవారం వార్తలు వచ్చాయి.

అయితే పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. జస్టిస్‌ కర్ణన్‌ కోసం గాలిస్తున్న కోల్‌కతా పోలీసులు ఆయన తడ ప్రాంతానికి వచ్చినట్లు జీపీఎస్, డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

justice-karnan

జడ్జి కారు సరిహద్దు గ్రామమైన పన్నంగాడు వద్ద ఉన్నట్లు సిగ్నల్‌ చూపడంతో ఎస్‌ఐ సురేష్‌ బాబు వెంటనే అక్కడ గాలించారు. కానీ అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తడలోని సీసీ కెమెరాలను పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. కోల్‌కతా, చెన్నై పోలీసులు, మీడియా ప్రతినిధు లు కూడా తడ పోలీస్‌ స్టేషన్‌కి చేరుకుని వివరాలు సేకరించారు.

మరోవైపు.. తరచూ శ్రీకాళహస్తికి వచ్చే జస్టిస్‌ కర్ణన్‌ బుధవారం చెన్నై నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్నారని, సాయంత్రం రాహుకేతు పూజ చేస్తారని వార్తలొచ్చాయి. చెన్నైలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసిన కర్ణన్‌ అధికారికంగా అక్కడి నుంచి ఖాళీ చేయలేదు. ఆయన ఆచూకీ తెలియక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు.

English summary
Swinging into action after the Supreme Court ordered the arrest of Calcutta High Court Judge C.S. Karnan, top police officers of West Bengal reached Chennai on Wednesday morning and mounted a search for him.Some members of the team went to Srikalahasti, in Andhra Pradesh, while the rest camped in the city. The team also searched for him in Tada and surrounding areas. Intelligence sources told The Hindu: “We have launched a manhunt to arrest him but his whereabouts are not known. So far, he is not traceable.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X