వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్ర ఉద్రిక్తత: బీజేపీ సీనియర్ నేత కారుపై రాళ్ల వర్షం: గెలుపును సూచిస్తోందంటూ

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇప్పటికే దాడులు, ప్రతిదాడులతో అనేక ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్-భారతీయ జనతా పార్టీ మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంటోంది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను కూడా మోహరింపజేయాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి.

ఇలాంటి ఉద్రిక్త వాతావరణం మధ్య బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తుండటం కలకలం రేపుతోంది. జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ పర్యటన కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. పార్టీ రాష్ట్రస్థాయి నాయకులతో కలిసి ఆయన దక్షిణ 24 పరగణా జిల్లాలలో పర్యటించడానికి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 24 పరగణాలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.

కోల్‌కత విమానాశ్రయంలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో 24 పరగణా జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ, దిలీప్ ఘోష్ ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. మార్గమధ్యలో డైమండ్ హార్బర్ వద్ద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేపీ నడ్డా కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రోడ్డుకు రెండు వైపులా నిల్చున్న తృణమూల్ కార్యకర్తలు.. పార్టీ జెండాలను పట్టుకుని కనిపించారు.

West Bengal: Protestors pelt stones at the vehicle of BJP leader Kailash Vijayvargiya in Diamond Harbour

జేపీ నడ్డా కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు కైలాష్ విజయ్‌వర్గీయ కారును లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి దిగారు. రాళ్లు, ఇటుకలను ఆయన కారుపై విసిరారు. ఈ దాడిలో కైలాష్ ప్రయాణిస్తోన్న కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు.

డ్రైవర్ వైపు ఉన్న అద్దం పగిలిపోయి, ఓ రాయి కారు లోపలికి వచ్చి పడింది. రాళ్ల దాడికి సంబంధించిన ఓ వీడియోను ఆయన తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలే తమపై దాడి చేశారని కైలాష్ ఆరోపించారు. తాము ఓడిపోతున్నామనే అక్కసుతోనే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఈ దాడికి పురిగొల్పి ఉంటారని విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెల్లుచీటి తప్పదని, ఆ రోజులు ఇక ఎంతో దూరం లేవని అన్నారు.

English summary
Protestors pelt stones at the vehicle of BJP leader Kailash Vijayvargiya in Diamond Harbour in West Bengal. He is on his way to South 24 Paraganas. Protestors also attempted to block the road from where BJP President JP Nadda's convoy was passing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X