వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కేబినెట్‌లో దేవశ్రీకి ఛాన్స్.. అమిత్ షా మాట మీద నిలబడ్డారుగా..!

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : బీజేపీ సర్కార్ రెండోసారి అధికారంలోకి రావడంతో పాత మంత్రులతో పాటు పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా కేంద్ర మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ క్రమంలో 42 మందితో మోడీ కేబినెట్ కూర్పు జరుగుతుండగా.. అందులో 13 మందికి కొత్తగా అవకాశం ఇవ్వడం విశేషం.

పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి దేవశ్రీ చౌదరికి.. మోడీ కేబినెట్‌లో స్థానం దక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆమెకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా అమిత్ షా కోరినట్లు దేవశ్రీ చెబుతున్నారు.

West Bengal Raigunj MP Devasri selected for Modi Cabinet

సొంత పార్టీ నేతలే చంపారా?.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్యకేసులో కొత్త కోణంసొంత పార్టీ నేతలే చంపారా?.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్యకేసులో కొత్త కోణం

అమిత్ షా మాట మీద నిలబడ్డారని దేవశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనను గెలిపిస్తే మంత్రి పదవి ఇప్పిస్తానని రాయ్‌గంజ్ ప్రజలకు మాటిచ్చారని.. ఆ క్రమంలో ఇప్పుడు మాట మీద నిలబడ్డారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు దేవశ్రీ.

అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వస్తుందని ముందే ఊహించినట్లు తెలిపారు దేవశ్రీ. అదలావుంటే పశ్చిమ బెంగాల్ నుంచి మోడీ కేబినెట్‌లో ఇద్దరికి చోటు దక్కినట్లైంది. ఇదివరకే బాబుల్ సుప్రియో మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఈసారి కూడా మోడీ కేబినెట్‌లో బెర్త్ దక్కింది.

English summary
West Bengal Raigunj MP Devasri selected for Modi Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X