వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IASకొడుకుకి Coronavirus,లండన్ టూ భారత్ , మాల్స్ లో హల్ చల్, ఎంజాయ్, సీఎం ఫైర్!

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలీక ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించారు. భారతదేశంలో ఇప్పటికే 190 కరోణా వైరస్ కేసులు నమోదైనాయి. లండన్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చిన 18 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ వ్యాధి ఉందని నిర్దారణ అయ్యింది. అయితే కరోనా వైరస్ సోకిన యువకుడు ఓ ఐఏఎస్ అధికారిని కుమారుడని, సరైన వైద్యపరీక్షలు చేయించుకోకుండా కోల్ కతా నగరంలోని మాల్స్ మొత్తం తిరిగి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడని వెలుగు చూడటంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి మండిపడ్డారు.

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు కరోనా భయం కొంచెం కూడా లేదు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు!కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు కరోనా భయం కొంచెం కూడా లేదు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు!

లండన్ టూ కోల్ కతా

లండన్ టూ కోల్ కతా

పశ్చిమ బెంగాల్ హోం శాఖలో సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న మహిళ కుమారుడు (18) లండన్ లోని యూకే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 15వ తేదీన ఆ యువకుడు లండన్ నుంచి భారత్ చేరుకున్నాడు. ఆ రోజు ఆ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు కనపడటం లేదని తెలిసింది. నిర్లక్షంగా ఎయిర్ పోర్టు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేసి ఆ యువకుడిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపించేశారు.

తెలిసినా పట్టించుకోని ఐఏఎస్ ఫ్యామిలీ

తెలిసినా పట్టించుకోని ఐఏఎస్ ఫ్యామిలీ

లండన్ లో నివాసం ఉంటున్న యువకుడి స్నేహితులకు కరోనా వైరస్ సోకిందని ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. లండన్ లో కలిసి చదువుకుంటున్న స్నేహితులకు కరోనా వైరస్ సోకిందని, వారితో కలిసి తిరిగిన కుమారుడికి వైద్యపరీక్షలు చేయించకుండా ఆ మహిళా ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులు పూర్తిగా నిర్లక్షం చేశారు.

సిటీలోని మాల్స్ లో యువకుడు హల్ చల్

సిటీలోని మాల్స్ లో యువకుడు హల్ చల్

లండన్ నుంచి భారత్ వచ్చిన ఆ యువకుడు రెండు రోజుల పాటు కోల్ కతాలోని అన్ని మాల్స్ తిరిగి షాపింగ్ లు చేసి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ లు తిరిగి ఎంజాయ్ చేస్తూ హల్ చల్ చేశాడు. మార్చి 17వ తేదీన ఆ యువకుడికి కరోనా వైరస్ వ్యాధి ఉందని గుర్తించిన అధికారులు షాక్ కు గురైనారు. అయితే అప్పటికే ఆ యువకుడు కోల్ కతా నగరం మొత్తం తిరిగాడని తెలుసుకున్న అధికారుల దిమ్మతిరిగిపోయింది.

సీఎం మమతా బెనర్జీ ఫైర్

సీఎం మమతా బెనర్జీ ఫైర్

కరోనా వైరస్ సోకిన వ్యక్తి భారత్ చేరుకుని తరువాత కోల్ కతా నగరం మొత్తం తిరిగే వరకు అతని కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్షం చేశారని తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. విదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న ప్రయాణికులు అందరికీ కచ్చితంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, వీవీఐపీలు, వీఐపీలు అంటూ నిర్లక్షం చేస్తే సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. వీవీఐపీల సంసృతికి స్వస్తి చెప్పాలని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని, ఇలాంటివి తాను సహించనని సీఎం మమతా బెనర్జీ అధికారులను హెచ్చరించారు.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19
ఎవరిది కరోనా పాపం, యువకుడికి చికిత్స

ఎవరిది కరోనా పాపం, యువకుడికి చికిత్స

ఐఏఎస్ అధికారిని కుమారుడికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని వెలుగు చూడటంతో అతనికి కోల్ కతాలోని ఐస్ లేషన్ వార్డులో చికిత్స చేయిస్తున్నారు. ఇదే సమయంలో ఆ యువకుడు ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులతో పాటు మాల్స్ లో ఎవరెవరిని కలిశాడు ?. అతని స్నేహితులకు ఏమైనా కరోనా వైరస్ వ్యాధి సోకిందా ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ సోకినా ఓ ఐఏఎస్ అధికారిని కుమారుడు అంటూ పట్టించుకోకుండా రెండు రోజుల పాటు అతన్ని గాలికి వదిలేసిన అధికారులది తప్పా, లండన్ లో స్నేహితులకు కరోనా వైరస్ వచ్చిందని తెలిసినా భారత్ వచ్చిన కుమారుడికి వైద్యపరీక్షలు చేయించకుండా నిర్లక్షం చేసిన ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులది తప్పా ? అనే విషయం ఆ దేవుడికే తెలియాలని సామాన్య ప్రజలు అంటున్నారు.

English summary
New Delhi: West Bengal's first Covid-19 patient evaded test for 2 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X