చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పసిగట్టిన శశికళ: ఒక్క రోజే భర్త వద్దకు, పెరోల్‌పై వచ్చి ఆమె చేస్తుంది ఇదీ!..

|
Google Oneindia TeluguNews

Recommended Video

శశికళ పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా ? | Oneindia Telugu

చెన్నై: శశికళ ఎక్కడున్నా ఆమె చుట్టూ ఏదో వివాదం ముసురుకుంటూనే ఉంది. ఆఖరికి జైల్లోను రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా పెరోల్‌పై బయటకు వచ్చిన ఆమె.. భర్త అనారోగ్యం సాకు చూపించి వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. శశికళ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నవేళ.. పలు ఆస్తులను ఆమె ఇతరుల పేర్ల మీదకు మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

5 రోజుల పెరోల్:

5 రోజుల పెరోల్:

తన భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చూసేందుకు అనుమతించాలని శశికళ 15 రోజుల పెరోల్ కోరారు. ఈ మేరకు ఆమె కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తన భర్త నటరాజన్‌కు లివర్ మార్పిడి చేయనున్నారని, కాలేయంతోపాటు శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం లేదని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన కోర్టు శశికళ కోరినట్టు 15రోజులు కాకుండా.. ఐదు రోజుల పెరోల్ కు అనుమతినిచ్చింది.

కేవలం ఒక్కసారి

కేవలం ఒక్కసారి

శశికళ వ్యవహారం చూస్తుంటే.. ఆమె బయటకు రావడానికి భర్త అనారోగ్యాన్ని ఒక సాకుగా ఉపయోగించుకున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పెరోల్‌పై బయటకు వచ్చిన తర్వాత.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆమె తన భర్త నటరాజన్ వద్దకు వెళ్లారు.

 కలవరపెడుతున్న ఐటీ దాడులు

కలవరపెడుతున్న ఐటీ దాడులు

అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్ష పొందుతున్న శశికళకు.. ఐటీ దాడులు మరింత ఆందోళన చెందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన 622 ఆస్తులను ఇతరుల పేర్ల మీదకు మార్చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ అధికారులు ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచారని చెబుతున్నారు.

భారీ అక్రమాస్తుల గుర్తింపు

భారీ అక్రమాస్తుల గుర్తింపు

ఇటీవల ఏకకాలంలో ఐటీ అధికారులు జయా టీవి, శశికళ ఆస్తులు, ఆమె బంధుమిత్రుల ఇళ్లపై దాడులు చేశారు. దాదాపు 160చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు.. సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన గుర్తించినట్టు తెలుస్తోంది. 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా కూడా వారు గుర్తించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రస్తుతం శశికళ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం.

జయ టీవిపై ఐటీ దాడులు: మరో 160ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు..జయ టీవిపై ఐటీ దాడులు: మరో 160ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు..

 పసిగట్టిన శశికళ

పసిగట్టిన శశికళ

ఐటీ దాడుల నేపథ్యంలో మరోసారి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని శశికళ పసిగట్టారు. అందుకే ఈ ఐదు రోజుల పెరోల్ వ్యవధిని తన వ్యక్తిగత పనుల కోసం ఆమె వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల ఆరోపణలను తప్పించుకోవడానికి పెద్ద వ్యూహాలో రచిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి.. శశికళ మరోసారి ఐటీ ఉచ్చులో చిక్కుకుంటారో.. లేక తెలివిగా తప్పించుకుంటారో!

English summary
Sasikala was busy with her personal works, especially about properties. Actually she came out on parole for his husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X