వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్ యన్ ఐడియా సర్‌జీ: కారు టయోట .. కలరింగ్ ఆవుపేడ .. వై .. సో ?

|
Google Oneindia TeluguNews

ఎండలు మండిపోతున్నాయి. భానుడు రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఇక ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు రొటీన్ టిప్స్‌ను ఫాలో అవుతుంటే మరికొందరు భిన్నమైన చిట్కాలను అనుసరిస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు వినూత్నమైన ఆలోచన చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

ఈ కారు స్పెషాలిటీ ఏమిటి..?

ఈ కారు స్పెషాలిటీ ఏమిటి..?

అహ్మదాబాదులో ఎండలు 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. అక్కడ ఎండలు ఠారెత్తిస్తుండటంతో ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే జడుసుకుంటున్నారు. ఇక వాహనదారులైతే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక ఎండదెబ్బ తాకకుండా ఓ మహిల తన కారుకు ఆవుపేడతో కోటింగ్ ఇచ్చింది. ఈ కారు రోడ్డుపైకి వెళ్లగానే ప్రజలంతా దాని వంక తీక్షణంగా చూస్తున్నారు. కొందరైతే ఫోటోలు తీసుకుంటున్నారు.

ఆవు పేడ కోటింగ్‌తో కూలింగ్

రూపేష్ గౌరంగా దాస్ అనే వ్యక్తి ఫోటోలు తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అంతే ఇక ఈ ఫోటో వైరల్ అయ్యింది. ఇక 45 డిగ్రీల ఎండను తట్టుకునేందుకు ఆ కారు ఓనరు మంచి ఐడియా వేశాడంటూ తన వాల్‌పై రాసుకున్నాడు. ఆ కారు ఓనర్ పేరు సెజల్ షా అని తెలిపాడు. ఆ కారు లోపల ఎంతో కూల్‌గా ఉంటుందని పేర్కొన్నాడు.ఈ పోస్టు వైరల్ అయ్యింది. చాలామందికి పలు రకాల డౌట్లు కూడా వచ్చాయి. ఆవుపేడ వాసనను ఎలా తట్టుకుంటున్నారని కొందరు నెటిజెన్లు ప్రశ్నించారు. అంతేకాదు వాహనం చల్లగా ఉండేందుకు ఎంత మొత్తం ఆవుపేడను వినియోగించారని ప్రశ్నించారు.

 ఆవుపేడతో అనేక లాభాలు

ఆవుపేడతో అనేక లాభాలు

సాధారణంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నేలపై ఆవుపేడతో అలకడం సహజంగా జరుగుతుంటుంది. గోడలకు కూడా ఆవు పేడతో కోటింగ్ ఇస్తారు. అనంతరం అలానే ఎండే వరకు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల రెండు సీజన్లలో లబ్ది పొందుతారు. చలికాలంలో పేడతో కప్పబడిన గోడలు వెచ్చదనాన్ని ఇస్తాయి. ఇక ఎండాకాలంలో గోడల నుంచి సెగరాకుండా చల్లగా ఉండేలా ఈ ఆవుపేడ కోటింగ్ ఉపయోగపడుతుంది. అంతేకాదు దోమలు దరి చేరకుండా భద్రత కల్పిస్తాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఆవుపేడను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.

ఇప్పటికే గోమూత్రం, ఆవుపేడతో చాలా రకాల ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది. అంతేకాదు ఆవుపేడతో మొబైల్ ఫోన్‌కు కోటింగ్ ఇస్తే రేడియేషన్‌ నుంచి ఎలా కాపాడుకోవచ్చో వివరించారు కూడా.

English summary
As temperatures rise, people are trying various things to beat the heat. But one resident in Ahmedabad reportedly came up with a novel method to keep his car cool in the summer. he allegedly coated it completely with cow dung. Photos of the ‘cooling hack’ were shared on Facebook and they quickly went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X