• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిర్మలమ్మ చెప్పిన ఐసోటోపులు ఏంటి..? క్యాన్సర్ చికిత్సలో దీని పాత్ర ఏంటి..?

|

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని వివరించడంలో భాగంగా నాలుగవ సారి మీడియా ముందుకు వచ్చారు. శనివారం రోజు పలు రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలకు ప్లాన్ చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రీసెర్చ్ రియాక్టర్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనిద్వారా మెడికల్ ఐసోటోప్స్‌ను తయారు చేస్తామని చెప్పారు .ఈ ఐసోటోప్స్ క్యాన్సర్ ఇతర వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతాయి. ఇక ఐసోటోప్స్‌ ద్వారా క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు కూడా చాలావరకు తగ్గుతుందని ఆమె చెప్పారు. అయితే మెడికల్ ఐసోటోప్స్ అంటే ఏమిటి..?

 రేడియో ధార్మిక ఐసోటోపులు

రేడియో ధార్మిక ఐసోటోపులు

రేడియోధార్మిక ఐసోటోపులు, లేదా రేడియో ఐసోటోపులు, అణువుల సహజ క్షయం ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయన మూలకాల జాతులు. సాధారణంగా చర్మం రేడియేషన్‌కు గురైతే అది ప్రమాదకరంగా మారుతుంది. కానీ రేడియో ధార్మిక ఐసోటోపులు ఔషధ తయారీలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ రేడియో ధార్మిక ఐసోటోపులు పలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు టెక్నేటియం-99ఎం అనే రేడియోధార్మిక ఐసోటోపులను నోటి ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇవి శరీరంలోకి వెళ్లగానే శరీరమంతా తిరిగుతాయి. లేదా కొన్ని టిష్యూలు మాత్రమే వీటిని గ్రహిస్తాయి.ఇక ఇది విడుదల చేసే రేడియేషన్ ద్వారా సమస్య ఎక్కడుందనేది గుర్తుపట్టొచ్చు. ఇలా కేన్సర్ ఇతర జబ్బుల్లో ఒక మెడిసిన్‌లా ఈ ఐసోటోపులను వినియోగిస్తారు.

 రీసెర్చ్ రియాక్టర్‌లో తయారీ

రీసెర్చ్ రియాక్టర్‌లో తయారీ

ఐసోటోపులను తొలిసారిగా రేడియో ఫార్మాష్యూటికల్స్‌లో వినియోగించారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ కొత్తగా స్థిరంగా ఉండే ఐసోటోపులు కూడా వాడుకలోకి వచ్చాయి. ఇక మోలీబ్‌డెనం-99 చాలా తక్కువ సమయం వరకు జీవించి ఉండే ఐసోటోపులను హాస్పిటల్‌లో వినియోగించేవారు. ఇక టెక్నెటియం-99ఎం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా విరివిగా వినియోగించబడుతోంది. ఇవి చాలా పరిమితి సంఖ్యలో ఉన్న రీసెర్చ్ రియాక్టర్‌లలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేస్తారు. రేడియోధార్మికేతర ఐసోటోపులుగా కార్బన్-13ను లివర్ ఫంక్షన్‌ ఇతర మెటబాలిక్ టెస్టుల్లో వినియోగిస్తారు.

 క్యాన్సర్ చికిత్సలో ఐసోటోపుల పాత్ర ఏంటి..?

క్యాన్సర్ చికిత్సలో ఐసోటోపుల పాత్ర ఏంటి..?

ఇక రేడియోధార్మిక ఐసోటోపులు శరీరంలోని చెడు కణాలను ధ్వంసం చేస్తాయి. అలా క్యాన్సర్‌ నుంచి విముక్తి కలిగిస్తాయి. క్యాన్సర్‌కు చికిత్స అందించే భాగంలో రేడియో థెరపీ ప్రక్రియను వినియోగిస్తారు. శరీరంలో అనవసరంగా పెరుగుతున్న కణజాలంను ఈ ఐసోటోపులు ధ్వంసం చేస్తాయి. అణుఔషధ తయారీ, రేడియో థెరపీ రంగంలో రేడియో ఐసోటోపుల వినియోగం విరివిగా సాగుతోంది. 1900 శతాబ్దంలో కృతిమ రేడియో ఐసోటోపులను తయారు చేయడం జరిగింది. న్యూట్రాన్లతో కలగలిపిన స్థిరమైన మూలకాల ద్వారా కృత్రిమ ఐసోటోపులను తయారు చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి దీనిపై మరింత లోతైన పరిశోదనలు చేయడం ప్రారంభించారు. ఇక ఈ రేడియోఐసోటోపులను చికిత్స కోసం వినియోగించారు. ఇక ఈరోజు రేడియోధార్మిక ఐసోటోపులను చికిత్స కోసం వాడటం సర్వసాధారణమైపోయింది.

English summary
Finance Minister Nirmala Sitharaman announcing the 4th tranche of the economic stimulus package on Saturday, said that the government will establish a research reactor in PPP mode for production of medical isotopes, which will promote the welfare of humanity through affordable treatment for cancer and other diseases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more