వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటి ఈ విపత్కర పరిణామాలు..!మనసును దహించేస్తున్నాయి..!రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ విచారాన్ని వ్యక్తం చేసారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాలు, విషాద ఘటనల పట్ల గద్గద స్వరంతో ఆయన స్పందించారు. కరోనా సృష్టిస్తున్న కల్లోలోంనుండి పూర్తిగా బయటపడకముందే వేర్వేరు రాష్ట్రాల్లో అనేక విషాద సంఘటనలు చోటుచేసుకోవడం హృదయాన్ని కదిలిస్తోందని మోదీ ట్వీట్ చేసారు. బాదితులకు వీలైనంత మెరుగైన వైద్యసాయం అందిచడంతో పాటు వారి కుటుంబాను కేంద్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. నిన్న జరిగిన విశాఖ విషవాయువు దుర్ఘటన పట్ల, నేటి తెల్లవారు ఝామున ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదం పట్ల మోదీ స్పందించారు.

Recommended Video

Series Of Tragedies Corona, Vizag Gas Leak, Aurangabad Train mishap, What Are The Consequences
 కరోనా మహమ్మారి నుండి ఇంకా కోలుకోలేదు.. విషాద ఘటనలు కలిచివేస్తున్నాయన్న మోదీ..

కరోనా మహమ్మారి నుండి ఇంకా కోలుకోలేదు.. విషాద ఘటనలు కలిచివేస్తున్నాయన్న మోదీ..

దేశంలో జరుగుతున్న వరుస విషాదఘటనల పట్ల ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చలించిపోయారు. కరోనా వైరస్ నుండి ప్రజల ప్రాణాలు కాపాడే అంశాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిసిస్తున్న తరుణంలో వివిధ రాష్ట్రాల్లో విషాదఘటనలు చోటు చేసుకోవడం అత్యంత హృదయవిదారకమని మోదీ విచారాన్ని వ్యక్తం చేసారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న సందర్బాలే మనసును కలిచివేస్తుంటే ప్రమాదాలతో సంభవిస్తున్న మరణాలు మరింత దహించి వేస్తున్నాయని తెలిపారు.

 విశాఖ విషవాయువు, ఔరాంగాబాద్ రైలు ఘటనలు బాదాకరం.. విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని..

విశాఖ విషవాయువు, ఔరాంగాబాద్ రైలు ఘటనలు బాదాకరం.. విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని..

ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయని, ప్రతిఒక్కరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవని, కోరి ప్రాణాలమీదకు తెచ్చుకుని కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని ప్రధాని మోదీ దేశ ప్రజలకు హితవు పలికారు. ఇక తాజాగా విశాఖ విషవాయువు, ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటనపై మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు. తలదాచుకోవడానికి వలస కూటీలు ట్రాక్ పై సేద తీరుతున్న సమయంలో అనుకోని విషాదం చోటుచేసుకోవడం అత్యంత శోచనీయమైన సంఘటన అని మోదీ అభివర్ణించారు.

 ప్రజలు అప్రత్తంగా ఉండాలి.. ప్రాణాలు ఎంతో విలువైనవని మోదీ ట్వీట్..

ప్రజలు అప్రత్తంగా ఉండాలి.. ప్రాణాలు ఎంతో విలువైనవని మోదీ ట్వీట్..

తాజాగా వ‌ల‌స‌కూలీల‌పై దూసుకెళ్లిన రైలు ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీల‌పై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్ల‌టం విచార‌క‌ర‌మ‌న్నారు. జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇలా జరగడం అత్యంత విచార‌క‌ర‌మ‌ని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు మోదీ సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

 రైల్వే మంత్రితో చర్చలు జరిపాను.. అన్ని రకాల సాయం అందిస్తామన్న దేశ ప్రధాని..

రైల్వే మంత్రితో చర్చలు జరిపాను.. అన్ని రకాల సాయం అందిస్తామన్న దేశ ప్రధాని..

రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సంప్రదింపులు జరిపినట్టు మోదీ తెలిపారు. ప్రమాద ఘటనపై, అక్కడి పరిస్థితులపై, ప్రమాదానికా గురైన వారి స్థితిగతులపై మంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సాధ్యమైనంత మేర, అవసరమైనంత వరకు సాహాయం అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్‌లో ట్రాక్‌పై నిద్రపోతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా విషాద ఛాయను మిగిల్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేసారు.

English summary
Prime Minister Narendra Damodar Das Modi has been saddened by a series of tragedies in the country.Modi expressed regret that the tragedies in different states are so heartbreaking as the Yagna manages to save people's lives from the corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X