వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్యాక్స్‌ శ్లాబ్‌ ఎంచుకుంటే ఎలాంటి మినహాయింపులు కోల్పోతారు..? జాబితా ఇదే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంకు గుడ్ న్యూస్ చెప్పింది. గుడ్ న్యూస్ చెబుతూనే చిన్నపాటి మెలిక కూడా విధించారు ఆర్థికశాఖ మంత్రి . వ్యక్తిగత పన్ను శ్లాబుల్లో మార్పు చేశారు కేంద్రమంత్రి. ఇక వ్యక్తిగత పన్నుల విషయంలో కేంద్రం రెండు ఆప్షన్లు ట్యాక్స్‌పేయర్స్ ముందుంచింది.

గుడ్ న్యూస్ చెబుతూనే మెలికపెట్టిన ఆర్థిక మంత్రి

గుడ్ న్యూస్ చెబుతూనే మెలికపెట్టిన ఆర్థిక మంత్రి

బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ కొత్త ట్యాక్స్ శ్లాబులను ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన ట్యాక్స్ శ్లాబ్‌లను చూస్తే ట్యాక్స్ పేయర్స్‌కు శుభవార్తే అవుతుంది. అయితే ఇక్కడే ఒక మెలిక కూడా విధించారు. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ శ్లాబులతో పోలిస్తే కొత్తగా రాబోతున్న ట్యాక్స్‌ శ్లాబులతో చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాక్స్ శ్లాబుల్లో సెక్షన్ 80(c)కింద పొందే బెనిఫిట్స్ ఇకపై ఉండవు. అంటే పీఎఫ్, ఎన్‌పీఎస్, ఎల్ఐసీలపై వచ్చే మినహాయింపు కొత్త స్ట్రక్చర్‌కు వర్తించవు.

Recommended Video

#Budget2020 : Income Tax Slab Revised But Here Is the Twist And Choice is Yours ?
 సెక్షన్ 80 (D)కింద మినహాయింపులు ఉండవు

సెక్షన్ 80 (D)కింద మినహాయింపులు ఉండవు

ఇక సెక్షన్ 80(D)కింద వచ్చే మెడికల్ ఇన్ష్యూరెన్స్ ప్రీమియం, హెచ్‌ఆర్‌ఏ, హౌసింగ్‌ లోన్‌పై వడ్డీలపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఇవి కూడా కొత్త స్ట్రక్చర్‌కు వర్తించవు. ఇక కొన్ని చారిటబుల్ ట్రస్టులకు ఇచ్చే విరాళాలపై కూడా పన్ను మినహాయింపు ఉండదు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ స్ట్రక్చర్‌వల్ల వ్యక్తిగతంగా ఉపయోగం ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.

వ్యక్తిగత పన్ను కట్టేందుకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి

వ్యక్తిగత పన్ను కట్టేందుకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి

కొత్త ట్యాక్స్ విధానం కింద ఒక వ్యక్తి ఎలాంటి మినహాయింపులు పొందకుండా తక్కువ పన్ను కట్టేలా ఒక ఆప్షన్ ఉంది. అయితే పాత ట్యాక్స్ విధానం కొత్త ట్యాక్స్ విధానాల్లో దేన్నుంచి అధికంగా లబ్ధి పొందుతారో నిర్ణయించుకుని ఆ ట్యాక్స్ విధానంను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను విధానం చూస్తే ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావు లేకుండా తక్కువ పన్ను కడితే పనైపోతుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొందరు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటారు. వీరు పాత పద్ధతి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కోల్పోనున్న మినహాయింపుల జాబితా

కోల్పోనున్న మినహాయింపుల జాబితా


కొత్త ట్యాక్స్ శ్లాబులను ఎంచుకుంటే ఎలాంటి ప్రధాన మినహాయింపులను కోల్పోతారో చెప్పే జాబితా ఇలా ఉంది.

* వేతనాలు పొందుతున్న ఉద్యోగస్తులకు నాలుగేళ్లలో రెండు సార్లు వచ్చే లీవ్ ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు

* వేతనం పొందుతున్న ఉద్యోగస్తులకు జీతంతో హౌజ్ రెంటల్ అలవెన్స్ (HRA)వస్తుంది. దీనికి మినహాయింపు కొంత పరిమితివరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

* ట్యాక్స్ పేయర్స్‌కు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోయే ఛాన్స్

* సెక్షన్ 16 ప్రకారం ఎంటర్‌టెయిన్‌మెంట్ అలవెన్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్స్‌లో కోత

* హౌజింగ్ లోన్‌ తీసుకున్న వారు దానిపై వడ్డీ కడుతున్నట్లు ఇప్పటి వరకు ట్యాక్స్ మినహాయింపులో చూపేవారు. ఇకపై కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే ఈ ఆప్షన్ కోల్పోతారు

* ఫ్యామిలీ పెన్షన్‌లో భాగంగా రూ.15000 డిడక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ విధానంలో ఇది ఉండదు.

* సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు వచ్చే ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసీ ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజు, ఇతర పెట్టుబడులు అంటే ఎన్‌పీఎస్, పీపీఎఫ్‌లాంటివి కొత్త విధానంలో ఉండవు

English summary
Individuals opting to pay tax under the new lower personal income tax regime will have to forgo almost all tax breaks they were claiming in the current tax structure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X