• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమిరా వారీ.. ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి జైలుపాలైతిరి గ‌ద‌రా..! అమెరికా నా..? మ‌జాకా..?

|

హైద‌రాబాద్ : అంతా అద్బుతంగా చేసారు. కాలంతో పాటు సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అసాద్యాన్ని సుసాద్యం చేసుకున్నారు. అనుకున్న దానికంటే విప‌రీతంగా లాభాలు గ‌డించారు. అంతోనే క‌క్కుర్తి ప‌డి క‌ట‌క‌టాల పాల‌య్యారు. అజ‌య్ బ్రత్వాల్, దిలీప్ నైక్‌, భావేష్ మిస్త్రీలు అనే ముగ్గురు భారతీయులు మంచి స్నేహితులు. అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. తెలివి తేట‌ల‌కు, తెగింపుకు ఎలాంటి కొర‌త లేదు. సొంతంగా కంపెనీ నెల‌కొల్పి బాగా ప‌నిచేసి డ‌బ్బులు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. క‌ష్ట‌ప‌డ్డారు.

ఓట్ల చేర్పు,తీసివేత‌ల‌కు కొల‌మానం ఉందా..?కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!

వారి ఆశ‌యం నెర‌వేరింది. కోట్ల సంపాదించాల‌న్న వారి క‌ల నెరవేరింది. కంపెనీ ఊహించ‌ని లాభాల బాట‌లో ప‌య‌నించింది. ఒకటికి రెండు బ్రాంచీలు కూడా అన‌తి కాలంలోనే ఏర్పాట‌య్యాయి. న్యూజెర్సీ, నెవార్క్, న్యూయార్క్ న‌గ‌రాల్లో కంపెనీ విస్త‌రించింది. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నుకున్న స‌మ‌యంలో వారిలో నిద్రిస్తున్న క‌క్కుర్తి ఒక్క‌సారిగా మేల్కొంది. షాట్ క‌ట్ చేస్తే, ఇపుడుఆ మిత్ర త్రైయం జైల్లో ఊచ‌లు లెక్క పెడుతున్నారు. ఎందుకు..? ఎలా..?

What are you going to do? 10 years hard to hit jail...!!

వారు కంపెనీ న‌డ‌ప‌డంలో ఏలాంటి పొర‌పాట్టూ చేయ‌లేదు. నిభంధ‌న‌ల‌ను ఏమాత్రం అతిక్ర‌మించ‌లేదు. వారికి వ‌చ్చిన లాభాలు భారీగా ఉండ‌టంతో స‌గ‌టు భార‌తీయుడు లాగే వాళ్లూ ఆలోచించారు.బుద్ది అంత‌రాల‌లో ఎక్క‌డో దాక్కున 'క‌క్కుర్తి' అనే విచిత్ర గుణాన్ని వారికి వారే నిద్ర‌లేపుకున్నారు. అంతే వెంట‌నే ఓ చిత్ర‌మైన ప‌నికిమాలిన ఆలోచ‌న వారి ప‌త‌నానికి నాంది ప‌లికింది. ఇంత లాభాల్లో ప్ర‌భుత్వానికి టాక్స్ ల రూపంలో డ‌బ్బు ఎందుకు క‌ట్టాలి అనుకున్నారు. అంతే వెంట‌నే వ‌స్తున్న లాభాల్లో స‌గం దాచేసారు. కానీ అన్ని దేశాల అధికారులు ఒక‌లా ఉండ‌రు క‌దా..! అమెరికా ఇన్కం టాక్స్ అధికారులకు అనుమానం వ‌చ్చింది. వీరి మీద నిఘా పెట్టారు. ఇంకేముంది..

ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డి జైలుకు వెళ్లిన చందంగా త‌యార‌య్యింది మ‌న‌వాళ్ల ప‌రిస్థితి. ప‌దేళ్లుగా వారు చేసిన తప్పును ప‌ట్టుకుని విచారించి శిక్ష వేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టిన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌గా, కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. ఇంత‌కీ మ‌న‌వాళ్లు నెల‌కొల్పిన ఫార్మసీ కంపెనీ ద్వారా 9 మిలియన్ డాలర్లు లాభం రాగా... వారు కేవ‌లం 4 మిలియన్ డాలర్లు మాత్రమే లాభం వచ్చినట్లు ప్ర‌భుత్వానికి చూపారు. మిగ‌తా సొమ్ము చెక్కుల ద్వారా 2 అక్కౌంట్స్ లో వేసుకున్నారు. వారి ఆట‌లు ఎంతో కాలం సాగ‌లేదు. అన్ని తెలివితేట‌లు ఉండి... లాభాలు సంపాదించి ఇప్పుడు జైల్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు. ఏమిరా వారీ.. ఎంత ప‌ని సేసితివిరా.. ! మీ క‌క్కుర్తిలో క‌మండ‌లం..!!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ajay Brightwall, Dilip Nike and Bhavesh Mistri are three of the best Indian friends. Settled in America. Decided to work well and earn money with Own company. Strategically stepped. Worked hard. Their ambition was fulfilled. Their dream of making crores is fulfilled. The company has gone through unexpected profits. One or two branches were formed in a short time. New Jersey, Newark and in New York. Now they are in jail. how..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more