వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020లో ఇప్పటివరకు కరోనా కేసులే లేని పర్యాటక ప్రాంతం .. కరోనా .. అదేంటి? అని అడుగుతున్నారట !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో విలవిలలాడుతుంటే ఒక అందమైన పర్యాటక ప్రాంతం మాత్రం కరోనావైరస్ .. అదేంటి అని ప్రశ్నిస్తుంది. 2020 లో కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పంజా విసిరితే ఆశ్చర్యంగా ఒక పర్యాటక ప్రాంతం మాత్రం అందుకు భిన్నంగా హాయిగా ఉంది. ఇంతకీ ఆ పర్యాటక ప్రాంతం ఎక్కడ ఉంది.అక్కడ కరోనా వ్యాపించకపోవడానికి కారణాలు ఏంటి ? అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. 2020లో కరోనా కేసులే లేని, కరోనా మహమ్మారి నుండి తప్పించుకున్న ఆ పర్యాటక ప్రాంతం గురించి మీ కోసం ఈ కథనం

కరోనా వ్యాక్సిన్ డోసుల అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ .. వెల్లడించిన నివేదిక కరోనా వ్యాక్సిన్ డోసుల అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ .. వెల్లడించిన నివేదిక

 కరోనా కేసులే లేని పర్యాటక ప్రాంతంగా లక్ష ద్వీప్

కరోనా కేసులే లేని పర్యాటక ప్రాంతంగా లక్ష ద్వీప్

ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఇండియా ఇప్పటికే కోటి కేసులకు చేరువగా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తుంది . అయితే ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాని భారతదేశానికి చెందిన ఆ అందమైన పర్యాటక ప్రాంతంలో మాత్రం ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ఆ సుందర ప్రాంతం లక్షద్వీప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మాస్కులు , శానిటైజర్లు, కరోనా నిబంధనలే లేని కేంద్రపాలిత ప్రాంతం

మాస్కులు , శానిటైజర్లు, కరోనా నిబంధనలే లేని కేంద్రపాలిత ప్రాంతం

అక్కడ మాస్కులు లేవు. శానిటైజర్ లు వాడాల్సిన అవసరము లేదు. సామాజిక దూరం పాటించాల్సిన పనిలేదు. వివాహాలు, బహిరంగ సభలు, పార్టీలు అన్ని యధావిధిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ద్వీపంగా లక్షద్వీప్ ఉంది. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన లక్షద్వీప్ లో
ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, లోక్సభలో లక్షద్వీప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని సుందర పర్యాటక ప్రాంతం ఇదే అన్న ఎంపీ

ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని సుందర పర్యాటక ప్రాంతం ఇదే అన్న ఎంపీ

లక్షద్వీప్ ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ -19 మహమ్మారి నుండి బయటపడింది, డిసెంబర్ 8 నాటికి ఒక్క కేసును కూడా నివేదించలేదని ఆయన చెప్పారు.
తాము తీసుకున్న ఆదర్శప్రాయమైన ముందు జాగ్రత్త చర్యల వల్ల ఇప్పటివరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా లక్షద్వీప్ లో నమోదు కాలేదని ఫైజల్ పిటిఐకి చెప్పారు. అరేబియా సముద్రంలో ఉన్న లక్ష ద్వీపానికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రారంభంలోనే పర్యాటకుల రాక పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో లక్షద్వీప్ కరోనా నుంచి బయటపడినట్లుగా భావిస్తున్నారు. 36 చదరపు కిలోమీటర్ల ద్వీపానికి పర్యాటకులు ఎంట్రీని నియంత్రించడం తోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

పచ్చటి ప్రాంతం , ప్రకృతి ఒడిలో ప్రజలు .. అదే కారణమా ?

పచ్చటి ప్రాంతం , ప్రకృతి ఒడిలో ప్రజలు .. అదే కారణమా ?

ఇక్కడ మాస్కులు, శానిటైజర్ లు అక్కరలేదని ఎందుకంటే ఇది పచ్చటి ప్రాంతం అని గొప్పగా చెప్పారు ఎంపీ ఫైజల్. అంతేకాదు స్కూల్స్ తెరిచి తరగతులు నిర్వహిస్తున్న ఏకైక ప్రదేశం లక్షద్వీప్ అని చెబుతున్నారు.
భారతదేశమంతా కరోనా నిబంధనలు విధించినా, అలాంటి నిబంధన ఏమీ లేకుండా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నది లక్షద్వీప్ వాసులు మాత్రమేనని ఆయన చెప్పారు. దేశంలోనే అతి చిన్న యూటీఐ లక్షద్వీప్, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేరళ తీర నగరమైన కొచ్చి నుండి 220 నుండి 440 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్షద్వీప్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 64,000 గా ఉంది.

కేరళలో మొదటి కేసు నమోదు కాగానే పర్యాటకులపై ఆంక్షలు పెట్టిన లక్ష ద్వీప్

కేరళలో మొదటి కేసు నమోదు కాగానే పర్యాటకులపై ఆంక్షలు పెట్టిన లక్ష ద్వీప్

దేశంలోనే మొదటి కేసు కేరళలో నమోదు అయిన సమయంలో, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, పర్యాటకుల రాక ఆపడం ద్వారా
కరోనా వ్యాప్తి నివారించగలిగామని ఎంపీ చెబుతున్నారు.

ఎంట్రీ పర్మిట్ జారీ చేయడాన్ని తగ్గించడం ద్వారా, ద్వీపవాసులు కానివారు లక్షద్వీప్‌కు రావడాన్ని నియంత్రించామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలలో మరియు విదేశాలలో పనిచేసే లక్ష ద్వీపవాసుల ప్రవేశం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించామని, దీని ప్రకారం, లక్షద్వీప్‌కు రావాలనుకునే వారు కొచ్చిలో ఏడు రోజుల క్వారంటైన్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఖర్చును లక్షద్వీప్ భరిస్తుందని పేర్కొన్నారు.

 లక్ష ద్వీప్ వాసులు రావాలన్నా సరే కఠిన ఆంక్షలు

లక్ష ద్వీప్ వాసులు రావాలన్నా సరే కఠిన ఆంక్షలు

ఇక క్వారంటైన్ లో ఉన్నవారికి నెగటివ్ వస్తే అనుమతిస్తామని, లక్షద్వీప్ కు వచ్చిన తర్వాత కూడా వారు ఒక వారం పాటు నిర్బంధంలో ఉండాలని, ఇక దీనిని పోలీసు శాఖ, వైద్య శాఖలు కచ్చితంగా పర్యవేక్షిస్తున్నాయి అని ఎంపీ ఫైజల్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో తాను మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చాను అని, కొచ్చిలో ఏడు రోజులు నిర్బంధించడంతో సహా ద్వీపాలకు తిరిగి రాకముందు అన్ని నిబంధనలను పాటించానని పార్లమెంటు సభ్యుడు ఫైజల్ పేర్కొన్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతనే తిరిగి లక్షద్వీప్ వచ్చానని, ఆ తర్వాత కూడా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని పేర్కొన్నారు. లక్షద్వీప్‌ లో ఉన్న ప్రకృతి, పచ్చదనమే తమను కాపాడాయని లక్షద్వీప్ వాసులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Recommended Video

#SonuSood: 2020 Great Humanist ఈ ఏడాది గొప్ప మానవతావాదిగా గుర్తించబడిన సోను సూద్ | God For Migrants

English summary
The world may be in the grip of Covid-19 pandemic, disrupting daily schedules and robbing many of their weekend getaways, but life seems to be normal in the small Lakshadweep islands, which is yet to record the first positive case of coronavirus. No masks, no sanitisers, and many rules of Covid-19 are not in place and every human activity, including marriages and public gatherings continue, thanks to strict Standard Operating Procedure (SOP) that bars easy entry of people to the island in the Arabian sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X