వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌కుమార్‌తో: రమ్య, రక్షితలు ముప్పైల్లోనే..!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటులు రమ్య, రక్షితలలో పలు కామన్ అంశాలు ఉన్నాయి! వీరిద్దరు సినిమాల్లో ఉన్నత స్థాయిని చూశారు. రమ్య, రక్షిత ఇద్దరు కూడా దాదాపు తమ 30వ ఏటనే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.

ఈ ఇద్దరు నటీమణులను కూడా రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ పరిచయం చేశారు. ఇద్దరు కూడా పునీత్ కుమార్‌తో కలిసి మొదట నటించారు.

అంతటితో వారిద్దరికి రాజ్ కుమార్‌తో సంబంధాలు తెగిపోలేదు. వీరిద్దరు కూడా తమ చివరి చిత్రాలు రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు. (రమ్య, శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ఆర్యన్‌గా రానుంది) వీరిద్దరు ప్రముఖ కన్నడ, తమిళ నటులతో కలిసి నటించారు.

రమ్య

రమ్య

ప్రముఖ కన్నడ నటి, మండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతున్నారట! ప్రస్తుతం మైసూరులో కన్నడ సినిమా ఆర్యన్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన ఆమె నటిస్తున్నారు.

రమ్య దివ్య స్పందన

రమ్య దివ్య స్పందన

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, దిల్ కా రాజా, నీర్ దోసె, కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్నసినిమాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

దివ్య స్పందన

దివ్య స్పందన

ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త చిత్రాలను అంగీకరించనని తెలిపారు. నటన, రాజకీయాలకు ఒకేసారి న్యాయం చేయలేనని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇక పూర్తిగా రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. కొత్తగా ఒక్క సినిమాను అంగీకరించలేదన్నారు.

దూరం జరిగేనా?

దూరం జరిగేనా?

ఒక సినిమా పూర్తి కావాలంటే నలభై రోజుల వరకు సమయం పడుతుందని, ఈ రోజుల్లో ప్రజలకు దూరంగా ఉండవలసి వస్తోందన్నారు. మరో పదేళ్ల తర్వాత శివరాజ్ కుమార్ సోదరిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు.

స్పందన

స్పందన

కాగా, రమ్య ప్రకటనపై కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. సినిమాలలో నటిస్తూ, ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి.

అడ్డుకోవడానికా

అడ్డుకోవడానికా

వాటిని అడ్డుకోవడానికే రమ్య ముందు జాగ్రత్తగా ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం మాండ్య ఎంపీగా ఉన్న ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

రమ్య, రక్షితలకు పోలిక

రమ్య, రక్షితలకు పోలిక

ప్రముఖ కన్నడ నటులు రమ్య, రక్షితలలో పలు కామన్ అంశాలు ఉన్నాయి! వీరిద్దరు సినిమాల్లో ఉన్నత స్థాయిని చూశారు. రమ్య, రక్షిత ఇద్దరు కూడా దాదాపు తమ 30వ ఏటనే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.

రక్షిత

రక్షిత

ప్రముఖ నటి రక్షితకు డిమాండ్ వచ్చింది! 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నటి రక్షితకు కర్నాటక జనతా పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది! కర్నాటక జనతా పార్టీ అధ్యక్షులు పద్మనాభ ప్రసన్న మాట్లాడుతూ.. రక్షిత మాండ్య నుండి పోటీ చేస్తానంటే టిక్కెట్ ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

రక్షిత పోటీ

రక్షిత పోటీ

ప్రస్తుతం మాండ్య లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున నటి రమ్య ఉన్నారు. వచ్చే ఎన్నికలలోను ఆమె పోటీ చేయనున్నారు. అయితే, రక్షిత రానున్న ఎన్నికల్లో మాండ్య నుండే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

జెడి(ఎస్) నో

జెడి(ఎస్) నో

జెడి(ఎస్)లో ఆమెకు మాండ్య నియోజకవర్గం నుండి ఇతర అభ్యర్థుల నుండి పోటా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కెజిపి ఆమెకు టిక్కెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. రక్షితకు జెడి(ఎస్) ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జెడి(ఎస్) అధ్యక్షులు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మాండ్య నియోజకవర్గం పార్లమెంటు టిక్కెట్‌ను రక్షితకు ఇవ్వడం లేదని చెప్పారు.

టిక్కెట్ నో

టిక్కెట్ నో

రక్షిత మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపించారని తెలిపారు. కానీ ఆమెకు పార్టీ టిక్కెట్ ఇవ్వడం లేదని, స్థానికులకే టిక్కెట్ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జెడి(ఎస్) పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రక్షిత అంతకుముందు వెల్లడించారు.

మాండ్య

మాండ్య

జెడి(ఎస్) నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరే ప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అని రక్షిత వెల్లడించడం గమనార్హం. మరి మాండ్య నుండి పోటీ చేసేందుకు రక్షిత ఏం చేస్తారో.

బెంగళూరు సౌత్ నుండి పోటీ చేస్తారా

బెంగళూరు సౌత్ నుండి పోటీ చేస్తారా

జెడి(ఎస్) రక్షితను బెంగళూరు సౌత్ నుండి పోటీ చేయించాలనే ఆలోచనతో ఉందంటున్నారు. మరి మాండ్య పైన మొదటి నుండి అభిమానం పెంచుకున్న రక్షిత అక్కడ నుండి పోటీ చేస్తారా చూడాలి.

English summary

 For one, both Ramya and Rakshita entered politics before they turned 30, at a time when they were at the peak of their careers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X